ఇవాంకా వచ్చేస్తోంది... ఇప్పటికి చేసిన హడావుడికి మించి ఆమె వచ్చిన తరువాత మరింత హడావుడి జరగబోతోంది. ఇంతకీ ఆమె ఎవరు? అమెరికా అధ్యక్షురాలా? కాదే.. కేవలం అధ్యక్షుడి కుమార్తె. ఆమె కోసం మనం చేస్తున్న ఏర్పాట్లకు కోట్ల ఖర్చు. ఆమె సదస్సులో ఉండేది గంటయితే.. హోటల్లో గడిపేది అంతకు పది రెట్ల సమయం. ఆమె ఇక్కడుండే రెండు రోజుల్లో గట్టిగా రెండుమూడు గంటలకు మించి సదస్సులో ఉండడం లేదు. కానీ.. ఆమె కోసం అటు గోల్కొండ నుంచి ఇటు ఫలక్‌నుమా వరకు మొత్తం కర్ఫ్యూ విధించినంత పనిచేస్తున్నారు. బిచ్చగాళ్లను తరిమేశారు.. దోమలను పట్టుకుంటున్నారు.. కుక్కలను చంపేస్తున్నారు.. చిన్నచిన్న వ్యాపారాస్థులను దుకాణాలు బంద్ చేసుకోమంటున్నారు.. ఆమె పర్యటించే పరిసర ప్రాంతాల్లో ఆఫీసులు మూసేసుకోమంటున్నారు.. ఇవన్నీ చాలదన్నట్లుగా అక్కడ ఏళ్ల తరబడి ఇల్లలో ఉన్నవారినీ తలుపులు బిడాయించి కూర్చోమంటున్నారు. మరి మనం ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్న ఇవాంకా సొంత దేశం అమెరికాలో మనవాళ్ల పరిస్థితి ఏంటి? ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెవడు దాడి చేస్తాడో తెలియని దుస్థితి. సరే వారంతా సాధారణ ప్రజలు, అందరి బాధ్యతను అమెరికా చూసుకోలేకపోతోంది అనుకుందాం... మరి మన నేతలు, మన ఉన్నతాధికారుల విషయంలో గతంలో అమెరికా ఏం చేసిందో గుర్తుందా? నెత్తిన పెట్టుకోనవసరం లేదు, కనీస మర్యాద ఇచ్చిందా? అస్సలు ఇవ్వలేదు.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో మన ప్రముఖులను అమెరికా అవమానించింది.
కేవలం గత 16 ఏళ్ల లో జరిగిన ఘటనలే తీసుకున్నా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాజీ రాష్ర్టపతి, భారతదేశం ఎంతగానో గౌరవించే అబ్దుల్ కలాంను అమెరికా రెండు సార్లు తీవ్రంగా అవమానించింది. 2009లో ఓసారి, 2011లో మరోసారి అమెరికాలో కలాంకు అవమానం జరిగింది. 2011 సెప్టెంబరులో ఆయన విమానంలో కూర్చున్న తరువాత తనిఖీల పేరుతో ఆయన సూటు విప్పించి, బూట్లు తీసేసి చెక్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అమెరికా క్షమాపణలు కూడా చెప్పింది.
అంతెందుకు బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కు అమెరికాలో మూడుసార్లు అల్లరిపెట్టారు. గత ఏడాది ఆగస్టులో ఆయన్ను లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్టులో నిర్బంధించారు. అంతకుముందు 2012, 2009లోనూ ఇలాగే జరిగింది.
2002 - 2003లో రక్షణ మంత్రి హోదాలో వెళ్లిన జార్జి ఫెర్నాండెజ్‌ను అమెరికాలో తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టారు.
2010లో అప్పటి విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ను షికాగో విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు. ఆయన పేరు, పుట్టిన తేదీలు అమెరికా అధికారులు వెతుకున్న ఓ వ్యక్తి వివరాలతో సరిపోలడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నలతో వేధించడమే కాకుండా ఆయన్ను ఒక పట్టాన విడిచిపెట్టకుండా షెడ్యూల్ అంతా దెబ్బతినేలా చేశారు.
2010లో అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్ కు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
2013లో అమెరికాలోని భారత కాన్సులేట్ లో డిప్యూటీ కాన్సుల్ జనరల్ గా పనిచేసిన మహిళా అధికారి దేవయాని ఖోబ్రగడేకు అమెరికన్ అధికారులు స్ర్టిప్ సెర్చి చేశారు. స్ర్టిప్ సెర్చి అంటే మహిళల విషయంలో ఎంత తీవ్రమైనదో తెలిసిందే. కానీ... ఇప్పుడు వస్తున్న ఇవాంకాను మనవాళ్లు కనీసం భద్రతా పరమైన తనిఖీలు కూడా చేసేలా లేరు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులే ఇక్కడా భద్రతా వ్యవహారాలు చూస్తూ , మన అధికారులుకు ఆదేశాలిస్తున్న పరిస్థితి.