మహా 'ట్విస్ట్' సీఎం రేసు నుండి తప్పుకోనున్న ఉద్ధవ్..ఎందుకంటే ?

Update: 2019-11-22 10:16 GMT
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఎలాగైతే ముగింపు లేకుండా కొనసాగుతుందో ..మహారాష్ట్ర లో కూడా రాజకీయ సంక్షోభం అలానే కొనసాగుతోంది. పొత్తులతో బరిలోకి దిగిన బీజేపీ , శివసేనల ఎన్నికల ఫలితాల తరువాత అధికారం కోసం పటు విడవకపోవడంతో పొత్తుని తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూనే ఉంది. ఈ పొత్తు తో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఈ రోజు సాయంత్రం లోపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో కొన్ని షాకింగ్ ట్విస్టులు వెలుగులోొకి వస్తున్నాయి.

ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ , కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సీఎం పదవిని ఐదేళ్ల పాటు శివసేనకు , ఉప ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కి అని తెలుస్తుంది. ఈ నేపథ్యం లో మహారాష్ట్ర లో కాబోయే సీఎం ఉద్ధవ్ థాకరే అని ప్రచారం జరుగుతోంది. కానీ , తమకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్సీపీ తో కలిసి ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవడానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మనస్ఫూర్తిగా అంగీరించట్లేదని తెలుస్తోంది. ఒకవేళ సీఎం పదవిని ఎన్సీపీ తో పంచుకోవాల్సి వస్తే ఆ పదవే తనకి వద్దు అని చెప్తున్నట్టు సమాచారం.

ఈ సమయంలో సీఎం రేసు నుండి ఉద్దవ్ తప్పుకుంటే ..అయన స్థానంలో సీఎం పదవి రేసులో  సంజయ్ రౌత్ తో పాటు శివసేన సభా పక్ష నాయకుడు ఏక్ నాథ్ షిండే, సావంత్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది శాసన సభ్యులు సంజయ్ రౌత్  కె జై కొడుతున్నారు. కానీ , ఈ వార్తలను సంజయ్ రౌత్ తోసి పుచ్చుతున్నారు. అలాంటిదేమీ ఉండబోదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయిదేళ్ల పాటు శివసేన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారని కరాఖండిగా చెప్తున్నారు. ఏవైనా కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవిని అందుకోవడానికి ఉద్ధవ్ థాకరే విముఖత వ్యక్తం చేయాల్సి వస్తే.. అప్పుడు ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తామని సంజయ్ రౌత్ చెప్పారు.
Tags:    

Similar News