తెలంగాణ పొత్తు పొడిచింది. సీట్ల లెక్క తేలింది. అయితే ఇక్కడో ట్విస్టుంది. మహాకూటమిలో తాను ఎన్ని సీట్లు పోటీ చేసేదీ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో కొత్త రాజకీయ కాక మొదలైంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొత్తుపై కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరినట్లు ఆయన ప్రకటించారు. టీజేఎస్ - సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు.
అయితే... ఇంతకాలం అనుకుంటున్న లెక్కకు ఈరోజు కాంగ్రెస్ ప్రకటించిన లెక్కకు తేడా ఉంది. నిజానికి రాజకీయంగా కాంగ్రెస్ నెంబరు మంచి నిర్ణయమే గాని 30 సీట్లు డిమాండ్ చేసిన తెలంగాణ జన సమితి - పది సీట్లు ఎక్స్ పెక్ట్ చేసిన సీపీఐల వాటా ఉమ్మడిగా పది మాత్రమే ఉంచడం ఇపుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. అంత భారీ డిమాండ్లతో ఉన్న ఆ రెండు పార్టీలు ఇంత తక్కువ ప్రాధాన్యంతో సర్దుకుపోతాయా అన్న అనుమానం కూడా ఉంది.
ఒకవేళ ఆ ఇద్దరు సర్దుకు పోయారంటే... కాంగ్రెస్ చాలా పెద్ద సక్సెస్ సాధించినట్టే. అది జరిగితే మహాకూటమికి అది మొదటి విజయం అవుతుంది. అయితే కేవలం కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రంలోపు ఆ రెండు పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ కోదండరాం అసంతృప్తితో బయటకు వెళ్తే అది టీఆర్ఎస్‌కు చాలా పెద్ద గుడ్ న్యూస్‌కిందే లెక్క.