రాజ్యసభ మాజీ సభ్యుడు - తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తన రాజకీయ వ్యవహారశైలిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణ రాజకీయాలు - స్థానిక ప్రభుత్వం-పరిపాలనపై విమర్శలు ఎక్కుపెట్టిన వీహెచ్ ఇపుడు ఏపీపై దృష్టిసారించారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించిన వీహెచ్ బందరు పోర్టు భూసేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతానని బాధితులకు భరోసా ఇచ్చారు.
బందరు పోర్టు పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూ దోపిడీని ఎదుర్కొని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీ హనుమంతరావు భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ - వామపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో బందరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు. అభివృద్ధి పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - కెసిఆర్ భూదోపిడీకి పాల్పడుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు లాక్కునుంటుండగా - నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణం - బందరు పోర్టు పేరుతో వేలాది ఎకరాలు రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రకరకాల జీవోలతో రైతులను మభ్యపెట్టి భూదోపిడీకి పాల్పడుతున్నారని వీహెచ్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టప్రకారమే రైతుల నుండి భూములు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హనుమంతరావు హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/