పవన్ పై వీహెచ్ కి ఈస్థాయి కోపం ఉందా?

Update: 2016-10-10 04:30 GMT
వచ్చే ఎలక్షన్ సమయానికి ఏపీలో వైకాపా - టీడీపీ లే కాకుండా మూడో పార్టీగా కాంగ్రెస్సే పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు. తాజాగా ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై ఫైరయ్యారు. కాపులను మోసం చేస్తున్నాడని విమర్శిస్తూనే... ముద్రగడ పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తరతరాలుగా కాపులనేవారు రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారని వీహెచ్ తెలిపారు.

ఏపీలో టీడీపీ - వైకాపాల తర్వాత మూడోపార్టీ పవన్ దే అనే వార్తలు వస్తున్న నేపథ్యపై ప్రశ్నించగా... తన మొదటిమాటతోనే పవన్ పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పేశారు వీహెచ్. "మొన్నటివరకూ మాట్లాడలేదు, కాపుల సమస్యలున్నప్పుడు నోరు విప్పలేదు, ఆయన డైలాగులు జబర్ధస్త్ గా చెబుతాడు కానీ..." అంటూ ఎన్టీఆర్ ప్రస్థావన తీసుకొచ్చిన వీహెచ్... ఎన్టీ రామారావు పట్టుదల ఉన్న మనిషని - కష్టపడే మనిషని చెబుతూ... వీరంతా టచ్ అప్లై   మ్యాకప్ లే అనేలా స్పందించారు.

పవన్ కు కమిట్ మెంట్ నిజంగా ఉంటే ముద్రగడ స్ట్రైక్ చేసి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా పలకరించడానికీ వెళ్లలేదని, కాపులను డివైడ్ చేయడానికి తద్వారా చంద్రబాబుకి లాభం చేకూర్చడానికే చేస్తున్నాడాని, ఆయనకు నిజంగా కమిట్ మెంట్ లేదని వీహెచ్ ఫైరయ్యారు. ముద్రగడకు కమిట్ మెంట్ ఉందని, అలాంటి కమిట్ మెంట్ పవన్ కు ఉందా అని ప్రశ్నిస్తున్న వీహెచ్... పవన్ కల్యాణ్ విడగొట్టడానికి పనికొస్తాడు తప్ప కలపడానికి కాదని అన్నారు. పవన్ ప్రస్థావన రాగానే ఈ రేంజ్ లో వి. హనుమంతరావు స్పందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News