అదే నిజమైతే హైదరాబాదీలకు డబ్బే డబ్బు

Update: 2016-09-21 09:43 GMT
 గుర్తుందా.... కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత టీఆరెస్ ఆ ఊపులో పెద్ద పెద్ద మాటలు చెప్పింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు సిటీ అంతా అద్దాల్లేంటి రోడ్లేసి జనాన్ని ఖుషీ చేశారు. ఆ తరువాత టీఆరెస్ నేతలు రెచ్చిపోయి ప్రకటనలు చేశారు. సిటీలో ఎక్కడైనా రోడ్లపై గుంత కనిపిస్తే... దాన్ని తమకు చూపిస్తే వారికి ప్రైజుగా డబ్బిస్తామని కూడా అన్నారు. జనాలు దాన్ని లైట్ గా తీసుకున్నారు కానీ... ఇప్పుడు నిజంగానే వారు సిటీలోని గుంతలను చూపించడం మొదలుపెడితే జీహెచ్ ఎంసీ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది.

గ్రేటర్ ఎన్నికలకు ముందు వేసిన రోడ్లు నాణ్యత లేక మొదటే కొంత దెబ్బతినగా మిగతావి ఇప్పుడు వర్షాలకు పూర్తిగా పాడయ్యాయి. దీంతో హైదరాబాద్ లో ఉన్నవి రోడ్లా గుంతలా అన్నట్లు ఉన్నాయి.  దీనిపై విపక్షాలూ మండిపడుతున్నాయి.

హైదరాబాద్‌లోని రహదారుల దుస్థితిపై ఇందిరాపార్క్ వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత - మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా ఈరోజు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా గతంలో టీఆరెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. హైద‌రాబాద్‌ ను విశ్వనగరంగా చేస్తామని - గుంత చూపిస్తే వెయ్యి రూపాయ‌లు ఇస్తామని టీఆర్ ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నార‌ని, ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ఆయన ప్రశ్నించారు. హైద‌రాబాద్‌ లో ఎక్కడికెళ్లిన గుంతలే క‌న‌ప‌డుతున్నాయ‌ని ఆయన అన్నారు. ప్రజ‌లు ఇంటి నుంచి బయటికొస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని, వారు మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News