సుశాంత్ స్నేహితురాలు ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. వాళ్లకు లుక్ అవుట్ నోటీసులు

Update: 2022-10-19 02:28 GMT
బుల్లితెర నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. 30 ఏళ్ల వైశాలి బాలీవుడ్ లో పలు సినిమాలు, సీరియల్స్ చేసింది. చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు ఈమె. నాడు సుశాంత్ ను చంపేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.తాజాగా ఈమె ఆత్మహత్య మరోసారి దుమారం రేపింది. వైశాలి మధ్యప్రదేశ్ లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నటిగా ఎంతో భవిష్యత్ ఉన్న వైశాలి ఇలా మధ్యలోనే తన జీవితాన్ని ముగించడంతో ఫ్యామిలీ, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఈ ఆత్మహత్యకు కారణాలు అన్వేషిస్తూ దర్యాప్తుచేస్తున్నారు. విచారణలో భాగంగా వారికి వైశాలి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ నోట్ లో అంశాల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే పనిలో పడ్డారు. తాజాగా ఈ కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది.

వైశాలి మానసిక వేదనకు గురై సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆమె పక్కింట్లో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తి అని తేలింది.  రాహుల్ తరుచుగా వైశాలిని వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తేలింది.  వైశాలి తాజాగా మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు రెడీ కావడంతో రాహుల్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాడట.. ఇది వైశాలిని తీవ్రంగా బాధించినట్టు సమాచారం. అమెరికాలో పనిచేసే ఒక సర్జన్ తో వైశాలికి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి రాహుల్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మానసిక వేదన భరించలేక బయటకు చెప్పుకోలేక వైశాలి సూసైడ్ చేసుకున్నట్టు ఇండోర్ ఏసీపీ తెలిపారు.  ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినందుకు ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్ నవ్లానీతోపాటు అతడి భార్య దిశపై నోటీసులు జారీ అయినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి తెలిపారు. నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.5వేల రివార్డును సైతం ప్రకటించారు.

రాహుల్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలి ఈ ఠక్కర్. నాడు సుశాంత్ మరణించినప్పుడు ఆయనను చంపేశారంటూ ఈమె గళమెత్తారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు వైశాలి ఠక్కర్   ఆత్మహత్య చేసుకోవడం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News