వంగవీటి రాధాకృష్ణ... ఈ పేరు వినిపించినప్పుడల్లా చాలా మందికి జాలి వేస్తుంది. కాపు నేత వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధా... తన రాజకీయ ప్రస్థానంలో చాలా తప్పులే చేశారని స్వయంగా ఆయన అభిమాన గణమే గుసగుసలాడుకుంటున్న వైనం తెలియనిదేమీ కాదు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సాగిన రంగా ఆశయ సాధనే తన లక్ష్యమంటూ నిత్యం చెప్పుకునే రాధా... ఆ దిశగా ఏ మేర ఫలితం సాధించారన్న విషయాన్ని పక్కనపెడితే... అసలు రాజకీయంగా రాధా క్రమేణా కనుమరుగు అవుతున్నారన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో రాధాకు బాగానే ప్రాధాన్యం దక్కిందని కూడా చెప్పాలి. అయితే ఎందుకనో గానీ... తన తండ్రిని పొట్టనబెట్టుకున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలో చేరిన రాధా... రాధా, రంగా మిత్రమండలినే ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ నిర్ణయంపై మిత్రమండలిలోనే పెద్ద చీలిక వచ్చిందన్న వార్తలు కూడా వినిపించాయి. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధాకు... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిక్త హస్తమే ఇచ్చేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి దక్కడంతో ఇక నామినేటెడ్ పదవి కూడా రాధాకు దక్కే అవకాశాలు మృగ్యమయ్యాయి.
ఇలాంటి క్రమంలోనే రాధా మరో రాంగ్ స్టెప్ వేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి బాగా దూరం జరిగిన రాధా... జనసేనలో చేరిపోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు కూడా. అయితే జనసేనలో చేరే విషయంపై మాత్రం రాధా క్లారిటీ ఇవ్వడం లేదు. గురువారం రంగా జయంతి సందర్భంగా అయినా ఈ విషయంపై రాధా నుంచి క్లారిటీ వస్తుందని అంతా ఆశించారు. అయితే తనదైన మార్కు వ్యవహారాన్ని కొనసాగించేందుకే సిద్ధపడ్డ రాధా... తాజా తన తండ్రి జయంతి రోజున కూడా తన భవిష్యత్తు రాజకీయంపై మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో రాధా సైలెన్స్ వెనుక ఉన్న మర్మమేమిటన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.