టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పొలిటికల్ జీవితంలో మాయనిమచ్చగా ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఉండిపోయిన కీలక విషయం.. తహసీల్దార్ వనజాక్షి వ్యవహారం. చంద్రబాబు హయాంలో వనజాక్షిని.. చింతమనేని కొట్టారని.. ఇసుక లావాదేవీలకు ఆమె అడ్డు పడడంతో ఆగ్రహించిన ఆయన ఇసుక రీచ్‌లలోనే పడేసి కొట్టారని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం కూడా రేగింది. అయితే. దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన ప్రభాకర్.. అసలు.. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. కేవలం ఇది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు, తహసీల్దార్‌కు సంబంధించిన వ్యవహారమేనన్నారు.
``నేను ప్రెస్‌మీట్ లో ఉన్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఇసుక రీచ్‌లో తహసీల్దార్ వచ్చి రగడ చేస్తున్నారని..ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో నేను అక్కడకు వెళ్లాను. అప్పటికే అక్కడ ఉన్న మహిళా సంఘాలతో ఎమ్మార్వో.. వనజాక్షి.. గొడవ పడుతున్నారు. కుర్చీ వేయించుకుని కూర్చుని పునుగులు తెప్పించుకుని ఎగరేసుకుని తింటున్నారు. తీసుకువచ్చిన ట్రాక్టర్లకు వాహనాలను అడ్డు పెట్టారు. హద్దులు దాటి ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారని..ఆ మె ఆరోపించారు. దీంతో అప్పటికప్పుడు ఇతర అధికారులను పిలిచి.. కొలతలు వేయించాను. సరిహద్దలు నిర్ణయించాను. ఇంతలో మహిళలతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మంచి నీళ్ల పంపుల దగ్గర.. ఎలా అయితే.. గొడవపడతారో.. వాళ్లు అలా గొడవ పడ్డారు`` అని వివరించారు.
``మహిళలను ఆమె దూషించడంతో మహిళలు తిరగబడ్డారు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్జేశారు. ఈ క్రమం లో ఇసుకలో పడిపోయిన వనజాక్షి మొహం.. ఇసుకలో కూరుకుపోయింది. నేనే స్వయంగా ఆమెను లేవదీసి.. మంచినీళ్లు ఇచ్చి... గొడవను సర్దుబాటు చేశాను. అయితే.. ఈ రగడ అయిపోయిందని.. అనుకుని నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. అయితే.. తర్వాత..ఆమెను తాను కొట్టినట్టు మీడియా ప్రచారం చేసింది. నిజానికి వనజాక్షిని కొట్టే పరిస్థితి ఉంటుందా? కానీ ఆమె కావాలనే అలా ప్రచారం చేసుకున్నారు. తనను మహిళలు కొట్టారంటే.. మీడియాలో ప్రచారం కాదు కాబట్టి.. నేను కొట్టానంటే.. ప్రచారం వస్తుందని... అనుకుని అలా చేసింది`` అని చింతమనేని పేర్కొన్నారు.
అయినప్పటికీ.. విషయాలను చంద్రబాబు చెప్పినా.. తనపైనే చర్యలకు సిద్ధమయ్యారు. తననే హెచ్చరించారు.. అని చింతమనేని చెప్పారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూకుఆమెను కూడా పిలిచి.. ఇక్కడ తనపక్కనే సీటు వేస్తే.. బాగుండేదని.. వాస్తవాలు ప్రజలకు తెలిసేవని అన్నారు.