తెలంగాణ తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్ నాయకుల్లో ఒకరు, పార్టీ అనుబంధ విభాగమైన తెలుగురైతు నాయకుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ధ్రువీకరించారు. పార్టీ కార్యకర్తలకు సైతం వెల్లడించారు. తన ఇలాకా అయిన గజ్వేల్ లోని కార్యకర్తలు - అభిమానుల సమావేశం ఏర్పాటుచేసి వారి సమక్షంలోనే టీడీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడం వెనుక, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేక కారణాలు ఉన్నాయని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితునిగా పేరున్న ఈయన స్వస్థలం గజ్వేల్ మండలం బూరుగుపల్లి. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి...గట్టి పోటీ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా మెదక్‌లో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ విషయంలో అరెస్టు అయిన ప్రతాప్ రెడ్డిని పార్టీ పరంగా సరైన రీతిలో తెలుగుదేశం గుర్తించలేదని టాక్ ఉంది. అసంతృప్తి చాలామందిలో ఉంది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో మంచి నాయకుడి కోసం వెతుకుతున్న కాంగ్రెస్ వంటేరుకు గాలం వేసింది. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. కాగా, వంటేరు రాజీనామాతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అయిన సిద్ధిపేట, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అయినట్లేనని అంటున్నారు.