అడవిదొంగ వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

Update: 2020-07-19 13:30 GMT
వీరప్పన్.. ఈ గంధపు చెక్కల స్మగ్లర్ పేరు చెబితేనే దక్షిణాది రాష్ట్రాలు వణికిపోయేవి. ఒకప్పుడు కర్ణాటక.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాండించిన అడవి దొంగను చాలా స్కెచ్ వేసి మరీ హతమార్చారు.

అయితే వీరప్పన్ మరణించినా ఆయన భార్య - కూతురు ఇప్పటికీ ఉన్నారు. తాజాగా వీరప్పన్ కూతురు విద్యా వీరప్పన్ కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది.

వీరప్పన్ కూతురు విద్య వృత్తిరీత్యా న్యాయవాది. గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు ఆయన కూతురికి రాష్ట్రస్థాయి కీలక పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News