ఓటుకు నోటు కేసులో వేడి ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే కేసు దర్యాప్తులో వేడి మీద ఉన్న తెలంగాణ ఏసీబీ తాజాగా మరో దూకుడు నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఓటుకునోటు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వేం నరేందర్‌రెడ్డిని సైతం నిందితుడిగా చేర్చారు. తాజాగా ఈ కేసులో మరో ముందడుగు పడింది.
ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీచేసింది. బుధవారం ఉదయం 10 గంటలలోపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద కృష్ణకీర్తన్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వేంను విచారించిన ఏసీబీ..ఆయన కుమారుడిని సైతం విచారణ చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.