మాతృ భాషలోనే మాట్లాడాలి..ఇంగ్లిషు నేర్చుకోవటం తప్పు కాదు

Update: 2019-12-24 12:11 GMT
మాతృ భాష మీద ప్రేమ మాత్రమే కాదు పట్టు ఉన్న పెద్దమనిషిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చెప్పాలి. అమ్మ భాష మీద పట్టు మాత్రమే కాదు..తన అంత్యప్రాస విన్యాసాన్ని పరాయి భాష అయిన ఇంగ్లిషు.. హిందీలోనూ చూపించే సత్తా ఉన్న నేతగా ఆయనకు మంచి పేరుంది.  తాజాగా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుతున్న తొలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మాతృ భాషను మర్చిపోవద్దన్న ఆయన.. మాట్లాడేటప్పుడు అమ్మ భాషలోనే మాట్లాడాలన్నారు. అదే సమయంలో ఇంగ్లిషు నేర్చుకోవటం తప్పు ఎంతమాత్రం కాదన్నారు. భాషలు.. వేషాలు వేరు కావొచ్చు కానీ మనమంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. దేశ సమైక్యత.. సార్వభైమత్వానికి విరుద్ధంగా వ్యవహరించకూడదన్న వెంకయ్య.. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు నేరుగా ఏ విధంగా చేరాలో టెక్నాలజీ తెలియజేయాలన్నారు.

వ్యవసాయంపై అందరూ ఫోకస్ చేయాలన్న ఆయన.. యువత వ్యవసాయం గురించి ఆలోచించాలన్నారు. రాబోయే రోజుల్లో నీటి కోసం పోరాడే పరిస్థితి వస్తుందన్నారు. వియత్నాంలో వరిని మన స్వామినాథనే పరిచయం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు వెళ్లినా.. ఆంధ్రప్రదేశ్ కు వచ్చినా సొంతింటికి వచ్చినట్లుగా ఉంటుందన్నారు వెంకయ్యనాయుడు. అరవైఏళ్లు కలిసి ఉన్నఅనుబంధాన్ని ఏ తెలుగోడు మాత్రం మర్చిపోగలరు. ప్రాంతాలు వేరు కానీ.. తెలుగోళ్ల భాష ఒక్కటే కదా?
Tags:    

Similar News