సిట్యూవేషన్ ఎలా ఉన్నా.. అంత్యప్రాసలతో మాట్లాడే చిత్రమైన రాజకీయ నేత వెంకయ్యనాయుడు. ఒక్క తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్.. హిందీలలోనూ ఆయనే అదే విధానాన్ని పాటిస్తారు. ఒక తెలుగువాడైనప్పటికీ.. అలవోకగా భాషతో ఆడుకునే ఆయన మాటలు అన్నీసార్లు అంతగా అలరించవు. కాకుంటే.. మిగిలిన వారితో పోలిస్తే కాస్తంత విలక్షణంగా నిలుపుతాయి.
సీనియర్ రాజకీయ నేతగా అపార అనుభవం ఉన్న ఆయనలో మరో కళ కూడా ఉంది. పార్టీలో ఎవరికి పట్టు ఉంటే వారిని ఆకాశానికి ఎత్తేసే ప్రత్యేక కళ కూడా వెంకయ్య సొంతం. అందుకే.. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నా.. వారి మనసుల్లో మాత్రం వెంకయ్యస్థానం ఒకేలా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటివి కాస్త కష్టమే. కానీ.. వెంకయ్యకు మాత్రం చాలా సులువు.
తాజాగా వెంకయ్య ప్రస్తావన ఇంత సుదీర్ఘంగా సాగాల్సిన అవసరం ఎందుకంటే.. బుధవారం ఆయన పార్టీకి చెందిన ఒక కార్యక్రమంలో చేసిన అద్భుత వ్యాఖ్యలే. కాంగ్రెస్ తో పాటు.. పలు విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరుచుకుపడుతుంటే.. మరే కేంద్ర మంత్రి చేయలేనంతగా మోడీ జపాన్ని ఆయన చేయటమే కాదు.. మోడీ అనే వ్యక్తి మామూలైనోడు కాదని.. భగవంతుడు ఇచ్చిన బహుమతిగా కీర్తించి.. మనసు దోచుకునే ప్రయత్నం చేశాడు. మోడీని భగవంతుడి బహుమతిగా అభివర్ణించిన ఆయన.. విపక్షాలు రాజీనామా చేయాలని పట్టుబడుతున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ దేశానికి ఉపయోగపడే విలువైన వ్యక్తిగా.. ఆణిముత్యంగా చెప్పుకొచ్చారు. ఇలా ఒకే ప్రసంగంలో ఇద్దరు వ్యక్తుల్ని వేర్వేరుగా కీర్తించినా.. ఎవరి స్థాయి తగ్గకుండా.. వారి మనసుల్లో కలకలాం నిలిచిపోయే వ్యాఖ్యలు చేసిన ఘనత వెంకయ్యకు మాత్రమే దక్కిందని చెప్పాలి.
చేసిన వెధవ పనులకు వెనకేసుకురావటం సమకాలీన రాజకీయాల్లో మామూలే అయినా.. వెంకయ్య స్థాయిలో మాత్రం ఎవరికి సాధ్యం కాదన్న అభిప్రాయానికి బలం చేకూరేలా తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. లలిత్ మోడ ఇష్యూలో పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయి విలవిలలాడుతున్న సుష్మకు వెంకయ్య వ్యాఖ్య కాస్త ఉపశమనం కలిగించేది అయితే.. విపక్షాలకు మాత్రం మరింత మంట పుట్టించటం ఖాయమని చెప్పక తప్పదు.