జగన్ ను పొగిడేసిన వెంకయ్య.. ఈసారి కారణమిదే..

Update: 2019-12-26 11:00 GMT
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొదట ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులను ఉపరాష్ట్రపతి వెంకయ్య తప్పుపట్టారు. తెలుగు ఏమైపోతుందని ప్రశ్నించారు.. వెంకయ్య సహా నేతల తీరుపై ఏపీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాజాగా ఏపీలో పర్యటించిన  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంగ్లభాషను ప్రోత్సహించడంలో తప్పు లేదని అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన వెంకయ్య ఏపీలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తెచ్చిన జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరమని.. అలాగే మాతృభాషను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ఇక సీఎం జగన్ నదుల అనుసంధానంను వెంకయ్య నాయుడు అభినందించారు. నదుల అనుసంధానం  జరిగితే దేశంలో ఆహార సమస్య ఉండదని అన్నారు. గోదావరి నీటిని ప్రకాశం, రాయలసీమకు ఇస్తామన్న జగన్ ప్రకటన సంతోషకరమన్నారు. గోదావరి ప్రాంతమైన రాజమండ్రి రావడం తనకు ఎంతో ఇష్టమన్నారు.
Tags:    

Similar News