ఎంత సంప్రదాయం అయితే మాత్రం.. మరీ ఇంతలానా? అన్న భావన ఈ ఉదంతం విన్న వెంటనే కలగక మానదు. వింబుల్డెన్ టోర్నీలో ఆడే ఆటగాళ్లు అంతా తెలుపులోనే ఉండాలన్నది ఒక సంప్రదాయం. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే లో దుస్తులు వేరే రంగులో ఉన్నా.. నో అంటే నో అనేస్తున్నారు ఆ టోర్నీ నిర్వాహకులు.
తాజాగా ఒక అగ్రశ్రేణి క్రీడాకారణి విషయంలో చోటు చేసుకున్న ఉదంతం వింటే నోరెళ్ల బెట్టటమే కాదు.. సంప్రదాయం పేరుతో పిచ్చ పీక్స్ కు వెళ్లిందన్న భావన కలగక మానదు. ఐదు సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచిన అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ తాజా వింబుల్డెన్ టోర్నీలో ఆడుతోంది. ఎలిస్ మెర్టెన్స్ తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో విలియమ్స్ వేసుకున్న డ్రెస్ లో నుంచి గులాబీ రంగు బ్రా స్ట్రాప్ బయటకు కనిపించింది. వెంటనే.. ఆ విషయాన్ని టోర్నీ అధికారులు విలియమ్స్ కు చెప్పి.. రంగు బ్రాను మార్చుకోవాలని చెప్పారట.
దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్ విరామంలో లాకర్ రూమ్ కు వెళ్లిన విలియమ్స్ తన బ్రాను మార్చుకొని వైట్ కలర్ ది వేసుకొని వచ్చారు. వింబుల్డెన్ సంప్రదాయం ప్రకారం ఆటగాళ్లు ధరించే లో దస్తులు సైతం తెలుపు రంగులోనే ఉండాలి. ఒక వేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా ఉన్నా.. అది ఒక సెంటీమీటర్ కి మించి ఉండరాదన్నది నియమంగా చెబుతున్నారు. పింక్ బ్రా కారణంగా మ్యాచ్ మధ్యలో మార్చుకు రమ్మని చెప్పిన వైనాన్ని మీడియా సమావేశంలో మాట్లాడటం సభ్యత కాదంటూ వీనస్ ఆ విషయాన్ని వదిలేసింది.