ల‌గ‌డ‌పాటిపై చీటింగ్ కేసు పెట్టి లోప‌లేయాలి!

Update: 2019-05-23 06:12 GMT
కోట్లాది మందికి ఏదైనా చెప్పేట‌ప్పుడు ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. అంతే త‌ప్పించి నోటికి వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌టంలో అర్థం లేదు. ఎగ్జిట్ పోల్స్ అన్న వాటి విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆంధ్రా అక్టోప‌స్ గా పేరున్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. త‌న దుర్మార్గ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గట్లు.. ఎగ్జిట్ పోల్స్ కు త‌న‌దైన వ‌క్ర‌భాష్యం ప‌లికి ఆయ‌న చేస్తున్న ప్ర‌చారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు.

తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఏపీలో చారిత్ర‌క విజ‌యం దిశ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ ప‌య‌నిస్తున్న వేళ‌.. ఆయ‌న ట్వీట్ చేస్తూ.. ల‌గ‌డ‌పాటిపై విరుచుకుప‌డ్డారు. ల‌గ‌డ‌పాటి ఎవ‌రెవ‌రిని ఇంట‌ర్వ్యూ చేశారు. ఎన్ని శాంపిల్స్ తీశారు?   శాస్త్రీయంగా విశ్లేషించ‌టానికి చేప‌ట్టిన ప‌ద్ధ‌తులేమిటో వెల్ల‌డించాల‌న్నారు. ఒక‌వేళ ఆ విష‌యం మీద స‌మాచారం ఇవ్వ‌కుండా ఆయ‌న‌పై చీటింగ్ కేసు పెట్టి లోప‌లేయాల‌న్నారు.

ఇంకోసారి స‌ర్వే అన‌కుండా గుణ‌పాఠం నేర్పాలంటూ ట్వీట్ చేశారు. వీవీ ప్యాట్లను లెక్కించాల‌ని చంద్ర‌బాబు చేస్తున్న హ‌డావుడి ఆయ‌న్ను ఒక జోక‌ర్ స్థాయికి తీసుకెళ్లింద‌న్న విజ‌య‌సాయి రెడ్డి .. గ‌త డిసెంబ‌రులో మూడు హిందీ రాష్ట్రాల్లో గెలిచిన‌ప్పుడు ఈవీఎంలు.. వీవీ ప్యాట్ల గురించి మాట్లాడని వ్య‌క్తి ఇప్పుడు క్ష‌ణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ.. నేత‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మామూలుగానే ట్వీట్ల‌తో మోత పుట్టించే విజ‌యసాయి.. చారిత్ర‌క విజ‌యం నేప‌థ్యంలో ఆయ‌న ట్వీట్ల ప‌దును మ‌రింత పెరుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News