టీడీపీ అన్నా.. చంద్రబాబు - లోకేష్ అన్నా ఒంటికాలిపై లేచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి కుసింత కటువుగానే స్పందించారు. వారి బండారాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపట్టేశారు. ఎప్పుడూ ట్విట్టర్ యుద్ధం చేసే లోకేష్ బాబును అదే ట్విట్టర్ లో కడిగేశారు. అయితే కాసింత కటువుగానే.. తెలుగులో కూడా అర్థంకాని కొన్ని కఠిన పదాలతో.. బ్రాకెట్ లో రాస్తే కానీ అర్థం చేసుకోలేని పదాలతో తూర్పార పట్టారు. ఇంతకీ విజయసాయిరెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా?
జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి ఆయన పాలనను ఎండగడుతున్న లోకేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి. ‘తామే సర్వజ్ఞానులని.. అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో (కాగ్నిటివ్ బయాస్) ఉంటారని.. ఇదో సైకోలాజికల్ డిజాస్టార్ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. లోకేష్ కు ఇదే సమస్య ఉందని.. లోకేష్ తండ్రి చాలా కాలం అధికారంలో ఉండడం.. ఒక్కడే సంతానం కావడంతో ఆ అధికారం కోల్పోవడం వల్ల లోకేష్ కు వచ్చిన వ్యాధి ఇదీ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
తాజాగా ప్రపంచబ్యాంక్ సాయంపై టీడీపీ నేతలు - లోకేష్ దుష్ర్పచారం చేయడంపై విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అమరావతిలో గత చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని చూసే ఇప్పుడు నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంక్ వెనుకాడిందన్నారు. చంద్రబాబు హయాంలో 92 కిలోమీటర్ల రోడ్డుకు 1872 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు నిర్వహించడం పెద్ద కుంభకోణమని.. బ్యాంకు దర్యాప్తులో తేలడం వల్లే ఇలా దూరం జరిగిందని విమర్శించారు. కానీ ఇప్పుడు జగన్ స్వచ్ఛ పాలన చూసి మళ్లీ ప్రపంచబ్యాంక్ రుణాలివ్వడానికి వచ్చిందని.. ఇప్పుడు లోకేష్ కు ఇదే దిమ్మదిరిగిందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.