ఏదైనా కీలకమైన ఎన్నికల సమయంలో ఆచితూచి అడుగులు వేయటమే కాదు.. ముందుజాగ్రత్తగా డమ్మీ అభ్యర్థుల చేత కూడా నామినేషన్లు వేయించటం చూస్తుంటాం. తాజాగా అలాంటి పనే చేసి వార్తల్లో నిలిచారు ఏపీలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి.
జగన్ తో పాటు పలు ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న ఆయన నామినేషన్ ఏదైనా కారణాల వల్ల తిరస్కరణకు గురైతే ఎలా అన్న డౌట్ వచ్చిందేమో కానీ.. తనకు బదులుగా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలోకి నిలపటం గమనార్హం.
ఇంతకీ విజయసాయిరెడ్డి డమ్మీ అభ్యర్థి ఎవరో తెలుసా? ఆయన సతీమణి సునందారెడ్డి. నామినేషన్ పరిశీలనలో ఏదైనా అనుకోనిది జరిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా జగన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే సునందారెడ్డి చేత డమ్మీ నామినేషన్ వేయించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి పొరపాటు దొర్లకుండా ఉండాలన్నట్లుగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారన్న మాట.