ఏపీకి భారీ నష్టం వాటిల్లిందా? గతంలోని చంద్రబాబు ప్రభుత్వం కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రివీల్ చేశారు. బాబు గత పాలన గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆయన.. చంద్రబాబు లాలూచీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్లు నష్టపోయినట్లు చెబుతున్నారు. తమ పార్టీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావటంతో పోలవరం అంచనాల్ని రూ.47725 కోట్లకు కేంద్రం పెంచిన విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో రాష్ట్ర హక్కుల కోసం పెద్ద ఎత్తున తాము పోరాటం చేస్తున్నట్లు చెప్పుకున్నారు.
బాబు గతంలో చేసిన తప్పులు.. పడిన లాలూచీ కారణంగా రాష్ట్రం రూ.8వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ‘ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మా ఎంపీల ఒత్తిడితో పోలవరం అంచనాల్ని రూ.47725 కోట్లకు పెంచటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెరిగిన వ్యయాల ప్రకారం రూ.55625 కోట్లకు పెంచాలని అభ్యర్థించినా అడ్వైయిజరీ కమిటీ సూచనలకే ఓకే చెప్పిందన్నారు.
రాష్ట్ర హక్కుల్ని సాధించుకోవటం కోసం తాము కృషి చేస్తామని చెప్పిన విజయ సాయి.. ఏపీకి ప్రత్యేక హోదా.. పోలవరం నిధులు.. రాష్ట్ర రహదారుల డెవలప్ మెంట్ కోసం..ఉపాధి హామీ నిధుల కోసం.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం.. రైల్వే జోన్ ను సాధించటానికి.. ఆయా శాఖల కేంద్రమంత్రుల్ని కలుస్తున్నాం.. వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా ఎంపీ విజయసాయి తాజాగా తాను చేసిన పోస్టులో పేర్కొన్నారు.
ఏదో మాటలకే పరిమితం కాకున్నా.. తాము చేస్తున్న ప్రయత్నాల్ని తెలియజేసేలా.. ఇటీవల కాలంలో సదరు కేంద్రమంత్రుల్ని వైసీపీ ఎంపీలు భేటీ అయిన ఫోటోల్ని వరుసుగా పేర్చి మరీ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దీంతో.. తాము ఢిల్లీలో చేస్తున్న కృషిని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారని చెప్పాలి. మరి.. విజయసాయి చేసిన ఆరోపణలపై బాబు బ్యాచ్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.