కోర్టుకు వచ్చిన విజయశాంతి

Update: 2017-01-19 08:04 GMT
అవును.. విజయశాంతి కోర్టుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆమె పెద్దగా కనిపించట్లేదు? అలాంటిది కోర్టుకు రావాల్సిన అవసరం వచ్చిందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు కామ్ గా ఉన్నా.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన ఉద్యమాల సమయంలో ఆమె కాస్తంత యాక్టివ్ గానే పాల్గొన్నారు.

కొంతకాలం టీఆర్ఎస్ లో కీలక భూమిక పోషించిన విజయశాంతి. .తర్వాతి కాలంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె లక్డీకాఫూల్ దగ్గరి రైల్వేస్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆమెపై అప్పట్లో కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. కోర్టు విచారణలో భాగంగా తాజాగా నాంపల్లి కోర్టుకు ఆమె హాజరయ్యారు. ఈ కేసును ఈ నెల 24కు వాయిదా వేయటంతో ఆమె తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారే అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను రాజకీయాలకు దూరంగా ఉండటం లేదని..  సమయం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు. నిజమే.. నేతలకు అవసరం వచ్చినప్పుడే వారు కోరుకున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. అందుకు విజయశాంతి మినహాయింపు ఏమీ కాదుగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News