ఒకరి తర్వాత ఒకరుగా.. తమ సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుకలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా అధికారపక్షానికి చెందిన నేతల్ని కలిసి తమ సమస్యల్ని పరిష్కరించాలని అడుగుతుంటారు. అందుకు భిన్నంగా.. వివిధ రంగాలకు చెందిన వారు పవన్ కల్యాణ్ ను కలుస్తున్న సంగతి తెలిసిందే.
మొన్నటికి మొన్న చేనేత కార్మికులు.. ఆ రంగానికి చెందిన వారు పవన్ ను కలవటం..కొద్ది రోజలకే చేనేత సమస్యలపై పవన్ ఒక సభను ఏర్పాటు చేయటం తెలిసిందే. అంతకు ముందు కిడ్నీ సమస్యలకుగురి అవుతున్న ఉద్దాణం ప్రాంత వాసులు కావొచ్చు.. అక్వా పార్క్ ఇష్యూలోనూ పవన్ దృష్టికి తమ సమస్యల్ని చెప్పటం.. ఆయన వాటిపై స్పందించటం.. ఆ వెంటనే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయటం.. అందుకు తగ్గట్లే ప్రభుత్వం రియాక్ట్ కావటం ఒక సిరీస్ గా సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడా ఎపిసోడ్ లోకి నెల్లూరు విద్యార్థులు కూడా చేరారని చెప్పాలి.రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చిన నెల్లూరుజిల్లా విక్రమ సింహపురి వర్సిటీ విద్యార్థులు పవన్ ను కలిసి తమ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. వర్సిటీలో చోటు చేసుకుంటున్న అవినీతి .. అక్రమాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యల్ని విని చలించిన పవన్ కల్యాణ్.. వారి సమస్యలపై ప్రభుత్వం నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. వపన్ ను కలవటం కోసం నెల్లూరు నుంచి కాలినడకన బయలుదేరిన విద్యార్థులు విజయవాడ వరకూ వచ్చేసరికి.. విద్యార్థుల బృందంలో కొందరు అస్వస్థత అయినట్లుగా తెలుసుకున్న పవన్ తీవ్రంగా చలించిపోయారు. ఇక.. ఈ బృందానికి చెందిన మరికొందరు పవన్ ను కలిసి వర్సిటీ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/