హత్రాస్ బాలిక హత్యాచారం గురించి దేశ మంతా ఉడికిపోతున్న వేళ అక్కడి నేతలు, గ్రామస్థుల నుంచి మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. తాజాగా బీజేపీ నేత రంజిత్ శ్రీవాస్తవ సంచలన ఆరోపణలు చేశాడు. హత్రాస్ బాధిత యువతికి నిందితుడితో సంబంధం ఉందని.. నేరం జరిగిన రోజు యువతే నిందితుడిని మొక్కజొన్న చేనులోకి పిలిచిందని బీజేపీ నేత రంజిత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది.నిందితుడిని ప్రేమించడం వల్లే అతడిని యువతి పొలాల్లోకి పిలిచిందని ఆరోపించారు. అవారా యువతులు చెరుకు, మొక్కజొన్న, జొన్న పొలాల్లో పొదలు, అడవుల్లో మరణిస్తూ ఉంటారని రంజిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.
తాజాగా హత్రాస్ గ్రామ పెద్ద కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. బాధితురాలు.. ప్రధాన నిందితుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ తరుచుగా ఫోన్ లో కూడా మాట్లాడుకుంటున్నారని.. ఇది తెలిసి బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని గ్రామ పెద్ద ఆరోపించారు. బాధితురాలికి సెల్ ఫోన్ కొనిచ్చిందే నిందితుడు అని ఆరోపించాడు.
నిందితులంతా నార్కో టెస్ట్ కు రెడీగా ఉన్నారని.. బాధితురాలి కుటుంబ సభ్యులకు సైతం నార్కో టెస్ట్ చేయాలని.. అప్పుడు దోషులు ఎవరో తేలుతుందని గ్రామ పెద్ద సవాల్ చేశారు.
ఆ అమ్మాయిని కలిసేందుకు నిందితుడు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కోపంతో ఆమెపై దాడి చేశారని.. ఆ కారణంతోనే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని గ్రామ పెద్ద తెలిపారు.