దారుణం: కరోనా పరీక్షల్లోనూ పైరవీలే

Update: 2020-07-31 16:30 GMT
తెలంగాణలో కరోనా పరీక్షల్లోనూ ఫైరవీలు నడుస్తున్నాయి. కేంద్రాలకు రోగుల తాకిడి విపరీతంగా ఉంటోంది.. లక్షణాలున్న వారితోపాటు లేని వారు కూడా తరలివస్తున్నారు.

సిబ్బందిపై సిఫార్సుల ఒత్తిడి బాగా ఉండడంతో కరోనా పరీక్షల్లో ఫైరవీలు చేసిన వారికి మొదట పరీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకే ఇంట్లోంచి ఎక్కువమంది వెళ్తే కూడా పరీక్షలు చేయడం లేదు. టోకెన్లు ఇచ్చి మరీ మరో రోజు రావాలని తిప్పి పంపిస్తున్నారు.

హైదరాబాద్ లోని కొన్ని చోట్ల తక్కువమందికి పరీక్షలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని చోట్ల కేవలం సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

హైదరాబాద్ లో కొన్ని చోట్ల లీడర్లు, అధికారుల రికమేండేషన్లు ఉన్న వారికే పరీక్షలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నారు.
Tags:    

Similar News