కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ కలిగించింది. ఇక, విడిపోయిన నవ్యాంధ్రకు ఏదైనా ప్రత్యేకంగా ఒనగూరుస్తుందని భావించినప్పటికీ.. మొండిచేయి చూపింది కేంద్ర సర్కారు. అయితే.. ఒక ఊరట మాత్రం కల్పించింది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు రూ.1400 కోట్లు కేటాయిస్తూ ఆర్ధికసంఘం తీసుకున్న నిర్ణయం ఊరటనిచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా.. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ చెబుతున్న అమరావతి రాజధాని అంశాన్ని పక్కనబెట్టి, భవిష్యత్తులో ఆర్ధికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నగరంగా విశాఖకు ఈ మొత్తం కేటాయిస్తున్నట్లు ఆర్ధిక సంఘం ప్రకటించడం విశేషం.
కేంద్రంలోని బీజేపీతో వైసీపీ ప్రభుత్వం సఖ్యతగా మెలుగుతున్న నేపథ్యంలో.. బడ్జెట్లో ఏదైనా మేలు జరుగుతుందని భావించినప్పటికీ.. నిరాశ తప్పలేదు. కరోనా వ్యాక్సిన్, రెండు రైల్వే ఫ్రైట్ కారిడార్లు మినహా ఏపీకి దక్కిందేమీ లేదు. అయితే.. 15వ ఆర్ధిక సంఘం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం వైసీపీకి ఊరట కలిగించింది. విశాఖను ఆర్ధిక రాజధానిగా గుర్తించేలా వైసీపీ సర్కారు చేసిన ప్రతిపాదనల్ని 15వ ఆర్ధిక సంఘం ఆమోదించింది. హైదరాబాద్ కోల్పోవడం కారణంగా నష్టపోయిన మొత్తాన్ని భర్తీ చేసుకునేందుకు ఆర్ధిక నగరం నిర్మాణం కోసం విశాఖకు రూ.1400 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక సంఘం ప్రకటించింది. దీంతో విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు ఆమోదం లభించినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖ ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు పలు అవకాశాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ అందుకు తగినట్లుగానే నిధులు కేటాయించాలని ఆర్ధిక సంఘాన్ని, కేంద్రాన్ని కోరింది. దీనికి స్పందనగా కేంద్రం రూ.1400 కోట్ల నిధులను ప్రకటించడం విశేషం. ఆర్థిక కార్యకలాపాలతోపాటు ఇతర మౌలిక అవసరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.
గతంలో అమరావతికి నిధులు కేటాయించాలని 14వ ఆర్ధిక సంఘాన్ని టీడీపీ కోరింది. కొన్ని నిధులను కూడా రాబట్టింది. అయితే.. 15వ ఆర్ధిక సంఘం మాత్రం వైసీపీ సర్కారు ప్రతిపాదనల మేరకు విశాఖకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించడం విశేషం. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చురుగ్గా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా విశాఖకు నిధులు కేటాయించింది. దీంతో.. ఆర్ధిక రాజధానిగా విశాఖ విలసిల్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.