విశాల్‌ కు షాక్ః నామినేష‌న్ తిర‌స్కృతి

Update: 2017-12-05 12:58 GMT
తమిళనాడు నటుడు విశాల్ పోలిటికల్ ఎంట్రీకి అడ్డంకులు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప‌ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నటుడు విశాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఝ‌లక్ ఇచ్చింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం లేద‌ని విశాల్ నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం అధికారులు పక్కన పెట్టారు. విశాల్ తో పాటు పలువురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పక్కనపెట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్ చుక్కెదురైంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు దీప స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప‌లు కార‌ణాల‌తో దీప నామినేషన్ ను సైతం రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు.

ఇదిలాఉండ‌గా...మ‌రో రూపంలోనూ విశాల్‌ కు షాక్ త‌గిలింది. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్మాతల మండలి పేర్కొంది.ఓవైపు నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ మ‌రోవైపు నిర్మాత మండలి సూచన మేరకు విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఏ మ‌లుపు తీసుకుంటుందో వేచిచూడాలని అంటున్నారు.

కాగా, అనూహ్య‌రీతిలో  విశాల్ అనూహ్య రీతిలో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌ బ‌రిలో దిగారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు దివంగ‌త సీఎం జ‌య‌లలిత స‌మాధి వ‌ద్ద‌కు విశాల్ వెళ్లారు. జ‌య స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం విశాల్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై - కామరాజు - ఎంజీఆర్‌ లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించారు.  అనంతరం ఆయ‌న ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌తో మాట్లాడు ఆర్కే న‌గ‌ర్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు, అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని నియోజ‌క‌వ‌ర్గ ప్రజలను కోరుతున్న‌ట్లు తెలిపారు. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని విశాల్ వెల్ల‌డించారు. ఈ ఇద్ద‌రినీ తాను క‌ల‌వ‌లేద‌ని పేర్కొంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...త‌న‌కు సామాన్యుడిగా ఉండ‌టం ఇష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్కే న‌గ‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల తాగు నీరు - పాఠ‌శాల‌లోని - ఆస్ప‌త్రుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో గెలిచినా, ఓడినా త‌న‌కు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ముఖ్య‌మన్నారు. అయితే ఆదిలోనే..ఇలా బ్రేక్ ప‌డ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News