చిరు స్టెప్స్‌.. జ‌న‌సేన‌కు మేలుచేస్తాయా...!

Update: 2023-01-11 04:24 GMT
మెగాస్టార్ చిరంజీవి వేస్తున్న స్టెప్పులు.. జ‌న‌సేన‌కు మేలు చేస్తాయా ?  ప‌రోక్షంగా వైసీపీకి ల‌బ్ధి చేకూరుస్తా యా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. పైకి మాత్రం చిరంజీవి.. త‌న సోద‌రుడు,జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో ఉన్న‌త‌స్థానంలో త‌న త‌మ్ముడు ను చూడాల‌ని అనుకుంటున్న ట్టు ఆయ‌న కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌ట‌న చేశారు. ఇది ఆ పార్టీ వ‌ర్గాల్లో ఊపు తెచ్చింది.

అయితే, తాజాగా పొత్తులు, రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్న క్ర‌మంలో వీటిని ప్ర‌భావితం చేసేలా.. వాల్తేరు వీర‌య్య‌.. మెగా ఈవెంట్‌లో చిరు చేసిన వ్యాఖ్య‌లు..జ‌న‌సేన‌కు ఒకింత ఇబ్బందిగా మారాయ‌ని అంటున్నారు.

ఎలాగంటే.. విశాఖ‌లో తాను ఇల్లు క‌ట్టుకుంటాన‌ని చిరు చెప్పారు. దీనికి  వైసీపీ ఒక నినాదాన్ని తెర‌మీదికి తెచ్చింది. విశాఖ‌లో తాము ఏర్పాటు చేయ‌నున్న రాజ‌ధానిని దృష్టిలో పెట్టుకునే చిరు ఇలా వ్యాఖ్యానించార‌ని.. పేర్కొన్నారు.

అయితే.. ఇది అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల వ‌ర‌కే వైసీపీలో ప‌రిమితం అయినా.. రాబోయే రోజుల్లో మాత్రం.. దీనిని ఎన్నిక‌ల అస్త్రంగా ప్ర‌యోగించే అవ‌కాశం ఉంది.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. అనూహ్యంగా చిరంజీవి.. ఇలా ప్ర‌క‌టించ‌డం.. వైసీపీ ఇక్క‌డ రాజ‌ధానిని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం.. యాదృచ్ఛిక‌మే అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ సోద‌రుడిగా చూసిన‌ప్పుడు.. రాజ‌కీయాలు ప్ర‌భావితం అవుతాయ‌నే విష‌యాన్ని చిరు విస్మ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాన్ని వైసీపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామంటే.. వ్య‌తిరేకించిన‌.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల‌కు చిరు చేసిన ప్ర‌క‌ట‌న‌తో కౌంట‌ర్ ఇచ్చేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు. మ‌రి ఇది జ‌న‌సేన‌కు మేలు చేస్తుందా ?  వైసీపీకి మేలు చేస్తుందా?  లేక‌.. చిరును కేవ‌లం సినిమాల వ‌ర‌కు ప‌రిమితం చేస్తారా? అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News