అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో వాతావరణం వేడెక్కింది. ఎన్నిసార్లు కత్తులు దూసుకున్నా.. ఎన్నిసార్లు విమర్శించుకున్నా కీలక టైం వచ్చేసరికి బీజేపీ, శివసేన ఒక్కటై పోతుంటాయి. ఇక తాజాగా జరిగే ఎన్నికలు శివసేనకు ఎంతో ప్రత్యేకమైనవిగా మిగిలిపోనున్నాయి. ఈ పార్టీని బాల్ థాక్రే 1966లో స్థాపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ కుటుంబం నుంచి ఎవ్వరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే ఐదున్నర దశాబ్దాల తర్వాత ఈ కుటుంబం నుంచి ఓ యువనేత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.
శివసేనకు అత్యంత సురక్షితమైన వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా యువ సేన చీఫ్ ఆదిత్య ఠాక్రే నామినేషన్ వేశారు. ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రం అంతటా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతోన్న వేళ ఆదిత్య ఠాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది పెద్ద సంచలనమే అవుతుంది. ఠాక్రే కుటుంబం నుంచి ఆదిత్య ఠాక్రే మొదటిసారి ఎన్నికల బరిలో దిగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యే సునీల్ షిందే ప్రాథినిత్యం వహిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే ఆదిత్యకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా శివసేన కంచుకోటను ఎంపిక చేశారు. ఇక ఇక్కడ కాంగ్రెస్–ఎన్సీపీ మిత్రపక్షం లేదా వంచిత్ ఆఘాడి, ఎమ్మెన్నెస్ అభ్యర్ధులు పోటీ చేసినా ఆదిత్యకు గెలుపు వన్ సైడ్ అయిపోనుంది.
ఆదిత్యపై పోటీ చేసే వాళ్లకు డిపాజిట్లు కూడా రావని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ పోటీ చేసి ఓడిపోవడం కంటే అసలు పోటీ చేయకుండా ఆదిత్యను ఏకగ్రీవంగా గెలిపించాలని శివసేన నాయకులు మిగిలిన పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఆదిత్య ఠాక్రేపై అభ్యర్థిని నిలబెట్టకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) భావిస్తోంది.