ఉన్న తలనొప్పులు సరిపోనట్లుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేనా.. మోడీ అండ్ కో సైతం గడ్కరీ మాటల దాడితో పూర్తిస్థాయి డిఫెన్స్ లో పడిపోయిందని చెప్పక తప్పదు.
వివిధ అంశాలపై కాంగ్రెస్ స్పందిస్తున్న తీరు బీజేపీని కొత్త ఇరకాటంలో పడేస్తున్నయి. ఇలాంటి వేళ.. మోడీ బ్యాచ్ నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బ తీసేలా గడ్కరీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇంతకూ అసలేం జరిగిందంటే.. సొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా గడ్కరీ వ్యాఖ్యలు ఉన్నాయి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని అడ్డంగా బుక్ చేసేలా వ్యాఖ్యలు చేయటం ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
బీజేపీ అధికారంలోకి రావటానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని.. వారిలో కొత్త ఆశలు కల్పించామన్నారు నితిన్ గడ్కరీ. అయితే.. హామీలను నెరవేర్చే ప్రయత్నం ఏదీ జరగలేదన్న కొత్త బాంబును స్వపక్షం మీదనే గడ్కరీ వేసుకున్నారు. కలర్స్ ఛానల్ లో ప్రసారమయ్యే రియాల్టీ షో ‘అసల్ పవానే- ఇర్సల్ నమూనే’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీకి పలు ప్రశ్నలు సంధించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తో కలిసి పాల్గొన్న గడ్కరీకి తన సంభాషణలో భాగంగా కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్పందించిన గడ్కరీ.. మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు.. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నా.. ప్రజలకు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి.
ఈ నెల నాలుగైదు తేదీల్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారంలోకి రాకుంటే తామిచ్చిన హామీలతో తమకు సంబంధమే ఉండదు కదా? అంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడ్కరీతో పాటు షోకు హాజరైన బాలీవుడ్ ప్రముఖ నటుడు.. వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్ మాత్రం ఆచితూచి అన్నట్లుగా స్పందించి జాగ్రత్తలు తీసుకున్నారు.
అలివి కాని హామీలు ఇచ్చి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న దరిద్రపుగొట్టు ప్లాన్ ను చాలా తెలివిగా బీజేపీ అమలు చేసిందన్న విమర్శలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి.
విపక్షాల చేతికి గడ్కరీ వ్యాఖ్యలు సరికొత్త అస్త్రాలుగా మారనున్నాయి. గడ్కరీ వీడియో క్లిప్ ను తాజాగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. నిజం చెప్పారు.. బీజేపీ పవర్లోకి రావటం కోసం తమ కలల్ని.. నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారంటూ పంచ్ వేశారు. మోడీ సర్కారు వంచన.. అబద్ధపు హామీలతో ఏర్పడిందన్న తమ మాటలకు గడ్కరీ వ్యాఖ్యలు ఏకీభవించినట్లుగా ఉన్నాయంటూ ట్వీట్ పంచ్ విసిరారు. మరి.. గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.