దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు ప్రకంపనల వేడి ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటీషన్లపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇదే క్రమంలోనే ఇవాళ ఫేస్ బుక్, వాట్సాప్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్రం వైఖరిని సవాల్ చేశాయి.
దేశవ్యాప్తంగా మే 26న అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల్లో గోప్యతకు సంబంధించి సెక్షన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాట్సాప్, ఫేస్ బుక్ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. దీనిపై హైకోర్టులో విచారణ ప్రారంభించింది. వాట్సాప్, ఫేస్ బుక్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.
తమ వినియోగదారుల గోప్యతను కాపాడుతామని గతంలో తాము హామీ ఇచ్చామని.. కానీ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ కారణంగా ఈ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఎదురవుతోందని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్, ఫేస్ బుక్ తెలిపాయి.
ఏదైనా ఓ వివాదాస్పద మెసేజ్ ఫేస్ బుక్ లోకానీ.. వాట్సాప్ లో కానీ వచ్చినప్పుడు దాని మూలాలు ఎక్కడున్నాయో వివరాలు ఇవ్వాల్సిందేనని కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ నిబంధనలు చెప్తున్నాయని.. ఇది తమ యూజర్ల గోప్యతా విధానానికి భంగం కలిగించడమేనని ఇవి హైకోర్టులో వాదించాయి.
యూజర్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం భారత్ లోరాజ్యాంగ నిబంధనల ప్రకారం కూడా చెల్లదని వాట్సాప్, ఫేస్ బుక్ వాదిస్తున్నాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది.
కేంద్రం తెచ్చిన కొత్త ఐటీరూల్స్ ప్రకాం మిగతా నిబంధనలు పాటించేందుకు సిద్ధమని.. కానీ గోప్యతా నిబంధనలు మాత్రం పాటించలేమని సోషల్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. తమ యూజర్ల కు ఇచ్చిన హామీలే ఇందుకు కారణంగా చూపుతున్నాయి. ఇందులో రాజ్యాంగ నిబంధనల్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.