లోకనాయకుడు, దక్షిణాది ప్రముఖ నటుడు అయిన కమల్ హాసన్ తమిళనాట ఓ స్టార్ హీరో. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన సినిమాలు ఆడాయి. ఆరాధ్య హీరోగా కీర్తనలు అందుకున్నారు. తమిళనాటే కాదు.. దక్షిణాది భాషల్లో కూడా డబ్ అయ్యాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న గొప్ప నటుడు పోటీచేస్తే ఓడిపోవడమా? ఎంతటి అవమానం.. మరెంతటి తీరని ఆవేదన.. అయినా పవన్ కళ్యాణ్ యే ఓడిపోంగ లేనిది కమల్ హాసన్ గా ఒక లెక్కనా? అంటే పవన్ ఎంత పిచ్చుక.. కమల్ ఓ పెద్ద పక్షిరాజం.. స్టార్ హీరో.. దేశం గర్వించే గొప్ప నటుడు.. అలాంటి నటుడికి ఓటమిని ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. కమల్ లాంటి మూల స్తంభాలు అయిన హీరోల ఓటమి ఏం సంకేతాలు పంపిస్తోంది? రజినీకాంత్ వచ్చినా ఓడిపోయేవారని అర్థమవుతోంది.
ప్రముఖ నటుటు వెండితెరపై వెలిగినంత సులువుగా రాజకీయాల్లో వెలగడం లేదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితల కాలం వేరు.. ఇప్పటి కాలం వేరు. గతంలో లాగా అభిమానంతో తారలకు ఓట్లేసే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు తమ వెంట ఉండే రాజకీయ నాయకులు, పార్టీలనే గెలిపిస్తున్నారు. అది తెలుగు నాట అయినా.. తమిళనాడులో అయినా.. అదే ఫలితం వస్తోంది.
తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తప్పించి మరే సినీతార ఎన్నికల్లో గెలవలేదు.తమిళనాడులో డీఎంకే ఊపు.. అధికారంలోకి రాబట్టి ఆ గాలిలో ఉదయనిధి గెలిచాడు తప్పితే లేకపోతే ఫలితం వేరేలా ఉండేదంటున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారతారన్న ప్రచారం జరిగిన విశ్వనటుడు కమల్ హాసన్ సైతం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోవడం దేశ సినీ పరిశ్రమలోనే అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఆయనతో సహా.. ఆయన పార్టీ అభ్యర్థులంతా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కమల్ హాసన్ మాత్రం తాను పోటీ చేసిన కోయంబత్తూర్ సౌత్ లో చివరి వరకు అధిక్యతలో సాగినా.. చివర్లో ఆయన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు.
తమిళనాడులో వనతి శ్రీనివాసన్ పరిచయమే కానీ.. బయట వారికి మాత్రం ఆమె కొత్తనే. తమిళనాడులో బీజేపీ విజయం సాధించటం.. అది కూడా కమల్ హాసన్ బరిలో దిగిన చోట కావటంతో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఆసక్తి రేపుతోంది. వనతి శ్రీనవాసన్ సీనియర్ లాయర్. అది కూడా ఎంత ఫేమస్ . న్యాయవాదిగా ఆమె చేసిన సేవలకు ప్రతిగా 2012లో అప్పటి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ ఇక్బాల్ చేతుల మీదుగా అవుట్ స్టాండింంగ్ వుమెన్ లాయర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా లాయర్ గా పని చేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో రెండింటిని కాస్త బ్యాలెన్సు చేసినా.. ఆతర్వాత మాత్రం రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించటం షురూ చేశారు.
1993లో బీజేపీ సభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఆమె ఎంపికయ్యారు. 2016లో కూడా బీజేపీ తరఫున పోటీ చేశారు కానీ.. ఆమె ఓట్ల వేట 33వేలకే పరిమితమయ్యారు. తాజాగా మాత్రం.. చివరి రౌండ్లలో చెలరేగిపోయిన ఆమె.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకుంటే.. ఎక్కువ మెజార్టీ కాదు. అధిక్యత పరంగా చూస్తే 1728 ఓట్లు మాత్రమే అయినప్పటికీ.. గెలుపు గెలుపే కదా? అందులోకి ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరోను ఓడించటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా? రాజకీయంగానే కాదు.. వనతి శ్రీనివాసన్ స్వచ్చంద సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు.
ఏదైనా ఇష్యూ మీద బాధితుల తరఫున పోరాటం ఆమెకు అలవాటే. పలు అంశాల మీద పోరాడిన ఆమె.. విజయాన్ని సాధించారు కూడా. పలు ఫోరంలు ఏర్పాటు చేశారు. ఆమె భర్త శ్రీనివాసన్. వారికి ఇద్దరు అబ్బాయిలు. ఏమైనా.. కమల్ ను ఓడించటం ద్వారా ఇప్పుడామె ఒక్కసారిగా జాతీయ స్థాయిలో అందరి కంట్లో పడ్డారు.