తమిళనాడు మాజీ సీఎం జయలలిత కంచుకోట ‘డాక్టర్ రాధాకృష్ణ నగర్’. ఆమె ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలితకు ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది.
డాక్టర్ ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన జయలలిత భారీ మెజార్టీతో గెలిచారు. ఆమె ప్రత్యర్థి, సీపీఐ నేత మహేంద్రన్ కు కేవలం 9710 ఓట్లు మాత్రమే లభించాయి. జయలలితకు 1,60,432 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో జయలలిత 1.50 లక్షల 722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇక 2016లో జరిగిన ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీపడిన జయలలిత తన సమీప ప్రత్యర్థి వాసంతి దేవీపై దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
జయలలిత మరణానంతరం డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గానికి 2017లో జరిగిన ఉపఎన్నికల్లో జయలలిత స్నేహితురాలు శశికళ మేనల్లుడు దినకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు.
తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం దిశగా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి ఎబెనెజెర్ కు ఆధిక్యంలో ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి రాజేశ్ పై విజయం దిశగా సాగుతున్నారు.