బాబూ.... పవన్ రాలేదు, మాయా మాయం

Update: 2019-01-19 16:07 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న  భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గద్దె దిగడమే మిగిలింది. ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. అయితే ఆయన అనుకున్నట్లుగా పరిస్థితులు లేవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటరా.... కోల్‌ కోతలో జరిగిన భారీ ర్యాలీలో చంద్రబాబుకు వ్యతిరేకమైన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎవరు పాల్గొనలేదు.

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ హాజారుకాలేదు. తనకు ప్రధాన శత్రువులైన ఈ రెండు పార్టీల నాయకులు రాకపోవాడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన విజయంగా చెప్పుకుంటున్నారు. అయితే పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ఈ మధ్య పుట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ‌్ ఏర్పాటు చేసిన జనసేన ప్రాతినిధ్యం కూడా ఈ ర్యాలీలో లోపించింది. ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించకపోవడం ఆయన రాజకీయ పరిణితికి తార్కణమని అంటున్నారు.

కోల్‌ కత్త ర్యాలీకి హాజారయిన వారి గురించి చెప్తున్న చంద్రబాబుకు, హాజారుకాని పవన్ కల్యాణ్, మాయవతి ఎందకు గుర్తుకు రావటం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటికే రెండుసార్లు మమతా బెనర్జీని కలుసుకున్నారు. ఇక పవన్ కల్యాణ‌్‌ కూడా వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన అగ్రనాయకులతో సమావేశమయ్యారు. ఇవన్ని బహిరంగ రహస్యమే. కోల్‌ కోత్త సభకు హాజారుకాని కె. చంద్రశేఖర రావు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహాన రెడ్డి గుర్తుకు వచ్చే చంద్రబాబుకు, మాయవతి, పవన్ కల్యాణ్ వంటి నాయకులు గుర్తుకు రాకపోవడం ఎలా చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయని చెప్తున్న చంద్రబాబు నాయుడుకు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని రేసులో ఉన్న మాయవతి, యువతలో ఎంతో పాప్యులారీటి ఉన్న పవన్ కల్యాన్ వంటి వారు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.



Full View
Tags:    

Similar News