తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎంత తియ్యగా ఉంటాయంటే.. ఇలాంటి అధినేతకు పాతికేళ్ల ముందే పొలిటికల్ గా బ్రేక్ వచ్చి ఉంటే.. ఎంత బాగుండేదో? అన్నభావన కలుగుతుంది. కానీ.. ఆయన మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయం.. ఆయనతో ట్రావెల్ చేసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అరచేతిలో వైకుంఠాన్ని చూపించే కేసీఆర్.. కొన్ని వాదనల్ని ఎంత హటాత్తుగా తీసుకొస్తారో.. అంతే అకస్మాత్తుగా అదృశ్యమైపోతుంటారు. అందుకు తగ్గ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ లో పాల్గొంటామని హడావుడి చేయటమే కాదు.. కొందరు అధికారుల టీంను విశాఖస్టీల్ కు మరీ పంపిన కేసీఆర్.. తీరా బిడ్ ముగిసే సమయానికి పత్తా లేకుండాపోయిన వైనం బయటకు వచ్చింది. విశాఖ స్టీల్ బిడ్డింగ్ కు ఆసక్తి ఉన్న వారు బిడ్లు దాఖలు చేసుకోవచ్చని ఆహ్వానించటం తెలిసిందే. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు ఉంది. మొత్తం 22 మంది తమ ఆసక్తి ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ.. బిడ్ లు వేశారు.
తాజాగా సదరు 22 బిడ్లను ఓపెన్ చేయగా.. అందులో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన బిడ్ లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది. బిడ్ కు గడువు పెంచాలని కోరటం.. అందుకు తగ్గట్లే గడువు పెంచినప్పటికీ బిడ్ వేయకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి ఈ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనే అవకాశం లేదు.అయితే.. ప్రభుత్వ రంగ సంస్థలు బిడ్లలో పాల్గొనవచ్చు.
దీంతో తెలంగాణ సర్కారుకు మేజర్ షేర్ ఉన్న సంగరేణి సంస్థను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా కేసీఆర్ నిర్ణయంపై బోలెడంత చర్చ జరిగింది. ఇంతా చేసి.. చివర్లో బిడ్ లో పాల్గొనకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముడి పదార్థాలు కొనుగోలుకు అవసరమైన నిధులు.. కంపెనీ నిర్వహణకు అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్ కోసం బిడ్లను ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. విశాఖస్టీల్ ను ప్రైవేటు పరం కానివ్వమని.. తాము బిడ్ వేస్తామని పేర్కొన్నారు. అయితే.. కేసీఆర్ తీరుపై తెలంగాణవాదుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణలో ఖాయిలా పడ్డ పరిశ్రమల్ని తిరిగి తెరవని కేసీఆర్.. ఏపీకి చెందిన విశాఖ స్టీల్ ను తెరిపించటం ఏమిటి? అందుకోసం వేలాది కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి వేళలోనే.. బిడ్ లో పాల్గొనకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసినట్లేనని చెప్పాలి. కేసీఆర్ వ్యతిరేకులు అయితే.. అడ్డం పొడుగు మాటలు మాట్లాడటం ఎందుకు? ఇలా సెల్ఫ్ గోల్ వేసుకోవటం ఎందుకు? అన్నది ప్రశ్నలుగా మారాయి.