ఆ ఏపీ ఐఏఎస్ బెండు తీస్తున్న ' ముఖ్య ' నేత‌...ఏం జ‌రిగిందంటే...!

Update: 2019-07-09 17:30 GMT
రాజ‌కీయం వేరు.. అధికారం వేరు. రాజ‌కీయ నేత‌లు ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక సారి మార‌తారు.. లేదా ప్ర‌జ‌లు వారినే కావాల‌ని అనుకుంటే.. మ‌ళ్లీ వారే అధికారంలోకి వ‌స్తారు. సో.. అధికారులు మాత్రం అలా కాదు. వీరికి ప‌నిత‌ప్ప మ‌రో ధ్యాస ఉండ‌నే కూడ‌దని స‌ర్వీస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ, ఏపీలో గ‌త ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన కీల‌క అధికారులు మాత్రం ఈ స‌ర్వీస్ రూల్స్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్య‌మంత్రి వ‌ద్ద మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా మంది అధికారులు ఆయ‌న చెప్పిన‌ట్టు న‌డుచుకున్నారు.

ఒక‌రిద్ద‌రు ఏకంగా చంద్ర‌బాబును బుట్ట లో వేసుకునేందుకు ఆయ‌న‌కు లేనిపోని వ‌న్నీ కూడా నూరిపోశారు. క‌నీసం త‌మ కింది అధికారుల‌నుకూడా ప‌ట్టించుకోలేదు, రూల్స్ పాటించ‌లేదు. ఇక‌, మంత్రుల‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇలాంటి వారిలో కీల‌క‌మైన ఓ అధికారి తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యారు. బాబు హ‌యాంలో సీఎంవోలో చ‌క్రం తిప్పి.. సీఎం త‌ర్వాత తానే సీఎం అనే రేంజ్‌ లో వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌కు ఇప్పుడు సీఎంగా ఉన్న జ‌గ‌న్ చుక్క‌లు చూపిస్తున్నారు. జగ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే.. స‌ద‌రు అధికారిని వేక‌న్సీ రిజ‌ర్వ్‌ లో పెట్టారు. దీంతో ఆయ‌నకు పోస్టింగ్ లేకుండా పోయింది.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఐఏఎస్‌ ల‌పై జులుం ప్ర‌ద‌ర్శించి, మంత్రుల‌ను సైతం చోటా నాయ‌కులుగా చిత్రీక‌రిం చిన ఆయ‌న‌కు జ‌గ‌న్ ఇప్పుడు స‌ముచిత మ‌ర్యాద చేస్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ముఖ్య నేత అపాయింట్ మెంట్ కోసం ఏకంగా పది గంటలు వేచిచూడాల్సిన పరిస్థితి. అంత సేపు ఎదురుచూసినా ఫలితం శూన్యం. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఇఫ్పుడు అందరి చుట్టూ తిరుగుతూ పోస్టింగ్ కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఎంత దారుణం అంటే... ముఖ్య నేత అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూసిన ఆ సీనియర్ ఐఏఎస్ కనీసం భోజనం కూడా చేయకుండానే అక్కడ ఉండిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా అధికారం చేతిలో ఉంటే చేతనైనంత మందికి సాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలే కానీ..ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోకూడ దని సహచార ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి స‌ద‌రు అధికారికి ప్ర‌స్తుత సీఎం బాగానే బెండు తీస్తున్నార‌ని అంటున్నారు అధికారులు. మ‌రి ఇంకా ఏం జ‌రుగుతుందో చూడాలి.

    
    
    

Tags:    

Similar News