మరిది తో రాసలీల కి అడ్డొస్తున్న భర్తని భార్య ఏంచేసిందంటే ...

Update: 2019-11-02 07:11 GMT
సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇటువంటి  ప్రపంచంలోనా మనం బ్రతుకుతున్నది అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం ఆలోచిస్తూ ..అసలు మనం ఏంచేస్తున్నామో అని కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల విషయంలో రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇతరులతో అక్రమ సంబంధాలకు అడ్డువస్తున్నారని భార్యని భర్త , భర్తని భార్య .. మరీ  ఈ మద్యే అక్రమ సంబంధాలకు అడ్డుతగులుతున్నారని కూతుర్లే కన్న తల్లులని అతి కిరాతకంగా చంపేస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి  ఘటనే ఒకటి జరిగింది. మరిది తో రాసలీలలు కొనసాగిస్తున్న భార్య ..భర్త అడ్డుపడటం తో భర్తని విషం పెట్టి చంపాలని ట్రై చేసింది. కానీ , అదృష్టం బాగుండి  కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది.

భోపాల్‌లోని ఓ ప్రాంతంలో భార్య భర్తలు  కలిసి ఉంటున్నారు. అతడి తమ్ముడు సురేశ్ చదువు నిమిత్తం కొద్ది నెలలుగా అన్న ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యాపారం చేసే రాజేశ్ చాలా రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఇదే అదనుగా భావించిన అతడి భార్య మరిదిని రెచ్చగొట్టి అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజేశ్ లేని సమయంలో వదినా మరిదులు రాసలీలలు కొనసాగించేవారు. కొద్దిరోజుల తర్వాత వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన రాజేశ్ వారిపై  నిఘా పెట్టి అసలు విషయం కనిపెట్టాడు.  

తన తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సరికాదని చెప్పినా ఆమె వినలేదు. భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో రాజేశ్ తన తమ్ముడిని ఇంట్లో నుంచి పంపేశాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. భర్త తింటున్న అన్నంలో విషం కలిపి పెట్టింది. సగం అన్నం తర్వాత రాజేశ్ కడుపులో తిప్పడంతో అనుమానంతో వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు వెంటనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. కోలుకున్న తర్వాత రాజేశ్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 
Tags:    

Similar News