స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి అవసరమైన ముడి ఇనుము గనులను కేటాయించిన నేపధ్యంలో ఇప్పటికైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలవుతుందా ? అందరిలోను ఇపుడిదే ఆలోచన మొదలైంది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో స్టీల్ ఉత్పత్తి ఫ్యాక్టరీని ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. నిజానికి ఇది ప్రారంభం అవ్వాల్సింది విభజన చట్టంలో భాగంగా కేంద్రం ఆధ్వర్యంలో.
అయితే కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవటంతో చివరకు రాష్ట్రప్రభుత్వమే ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెడీ అయింది. ఏడాదికి 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఫ్యాక్టరీని నిర్మించాలని ప్రభుత్వం అనుకున్నది. ప్లాంట్ ఏర్పాటుకు 2019, డిసెంబర్లో జగన్ శంకుస్ధాపన కూడా చేశారు.
అయితే తర్వాత వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పనులు ముందుకు సాగలేదు. కరోనా తీవ్రత ఇపుడు తగ్గిపోయిన కారణంగా నిర్మాణ పనులు మొదలవ్వాలని జనాలు కోరుకుంటున్నారు. ఏ ఫ్యాక్టరీకైనా ముడిఇనుము గనుల కేటాయింపే అతి పెద్ద సమస్య.
అలాంటిది స్టీల్ కార్పొరేషన్ కు అనంతపురం జిల్లాలోని డీ హీరేహల్ మండలంలో 25 హెక్టార్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు కేంద్రప్రభుత్వం ఆమోదం కూడా లభించింది. ముందుజాగ్రత్తగా మరో రెండుచోట్ల గనులు కేటాయించటానికి ప్రభుత్వం ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది.
కేంద్రం నుండి ఆమోదం లభిస్తే వెంటనే ఆ గనులను కూడా కేటాయించటానికి రంగం సిద్ధమైంది. సో ఇనుము తయారీకి అవసరమైన గనుల కేటాయింపు అయిపోయిన కారణంగా వెంటనే నిర్మాణపనులు మొదలుపెట్టాలని కోరుకుంటున్నారు.
ముడిఇనుము గనులను కేటాయించని కారణంగానే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ఎంత ఇబ్బందుల్లో పడిందో అందరు చూస్తున్నదే. దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం మొత్తుకుంటున్నా కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వైజాగ్ స్టీల్స్ కేంద్రానికి కాబట్టి గనులను కేటాయించాల్సిందిగా కేంద్రమే. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదే కాబట్టి గనులను కేటాయించేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.