జగన్ క్యాబినెట్ లో ఆ మంత్రి గారి ప్రత్యెకత వేరేగా ఉంటుంది. ఆయన కేరాఫ్ ఢిల్లీగానే ఉంటారు. ఆయన మూడున్నరేళ్ళ ఆర్ధిక మంత్రిత్వంలో వైసీపీ బండిని నడిపించే అతి ముఖ్యమైన బాధ్యతను తీసుకున్నారు. జగన్ నవరత్నాలను సజావుగా నడిపించే బాధ్యత ఆయనదే. ఆ విషయంలో ఆయన సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. ఆయనే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్. అందరూ ఆయన్ని సెటైరికల్ గా అప్పుల మంత్రి అంటారు.
ఏపీకి కుప్పలు తెప్పలుగా అప్పులు తేవడంలో ఆయన టాలెంట్ కి జోహార్ అనే వారూ ఉన్నారు. ఇన్ని విధాలుగా ఇంతలా అప్పులు తేవచ్చా అని ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే బుగ్గనను కచ్చితంగా సంప్రదించాల్సిందే. ఏనాడో ఏపీ సర్కార్ ఖజానా నిండుకుంది. బుగ్గన లాంటి వారు లేకపోతే ఈపాటి ఏపీ సర్కార్ కచ్చితంగా ఇబ్బందులో పడేది.
అలా అప్పో సొప్పో చేసి ఏపీ సర్కార్ ని ఇన్నేళ్ల పాటు లాగుతున్న ఘనత కచ్చితంగా బుగ్గనదే. ఆయన 2014, 2019 ఈ రెండు సార్లూ డోన్ నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. విపక్షంలో వైసీపీ ఉన్నపుడు ఆయనకు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా జగన్ నియమించారు. ఇపుడు ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిని చేశారు. రెండు విడతల మంత్రివర్గంలో ఆయనే కొనసాగుతున్నారు అంటే ఆయనకు ఉన్న ప్రాధాన్యత అంతటిది అని అర్ధం చేసుకోవాలి.
ఆయన ఎవరినీ నొప్పించారు. ఇతర నేతల మాదిరిగా విపక్షం మీద నోరు పారేసుకోరు. సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతారు. అంతే కాదు, ఆయన తన శాఖ మీద కూడా పట్టు బాగానే సాధించారు. అయితే అప్పులు ఎక్కువగా తేవడం వల్లనే ఆయనకు రావలసిన పేరు రాలేదు. ఇదిలా ఉంటే నెల ముప్పయి రోజులూ ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అక్కడే కనిపిస్తారు అప్పుల కోసం అని విపక్షాలు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ నేపధ్యంలో బుగ్గన కూడా ఎటూ ఢిల్లీయే కేరాఫ్ గా ఉంది కదా ఇక ఇక్కడే ఉండిపోతే పోలా. ఈ గోలంతా ఎందుకు తనకు అని అనుకుంటున్నారులా ఉంది. దాంతో ఆయన 2024 ఎన్నికల్లో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎంపీ గా పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సంగతి ఏమో కానీ ఈ మంత్రిగారు మాత్రం తాను లోక్ సభకే పోటీ చేస్తాను అని అంటున్నారుట.
ఆయన మనసులో మాటను సన్నిహితులతో పంచుకుంటున్నారు అని అంటున్నారు. నిజానికి డోన్ నుంచి ఈసారి సుబ్బారెడ్డిని టీడీపీ రంగంలోకి దించుతోంది. ఆయన పట్టున్న గట్టి నాయకుడు. బుగ్గన అసెంబ్లీకి పోటీ చేస్తే గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. అదే టైం లో తన వారసులను రంగంలోకి దించి తాను తప్పుకుందామని ఒక దశలో ఆయన ఆలోచించారని అంటున్నారు. కానీ జగన్ నో అనడంతో ఇపుడు ఎంపీగా వెళ్తాను అని అంటున్నారు.
మరి దీని మీద అయినా జగన్ ఓకే అంటార అన్నది చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం. అందునా సీనియర్లను బరిలోకి దింపి అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం అతి ముఖ్యం. ఎలాంటి విమర్శలు లేని నాయకుడిగా ఉన్న బుగ్గనను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయిస్తే సిట్టింగ్ ఎంపీకి కొత్త దారి చూపాలి. అలాగే డోన్ లో కూడా కొత్త క్యాండిడేట్ వెతకాలి.
మరి జగన్ మదిలో ఏముందో తెలియదు కానీ మంత్రి పదవి ముచ్చట మాత్రం బుగ్గనకు బాగానే తీరిపోయింది అని అంటున్నారు. ఆయన పదవిని ఎంజాయ్ చేయలేదు సరికదా ఢిల్లీలో పడిగాపులు కాయడం, దాని మీద విపక్షాల నుంచి వచ్చిన విమర్శలు, సొంత నియోజకవర్గానికి రాజకీయానికి దూరం కావడంతో బాగా విసిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.