`అవ‌నిగ‌డ్డ‌`లో టీడీపీ గెలిచేనా...?

Update: 2022-08-28 01:30 GMT
ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అవ‌నిగ‌డ్డ‌. కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009, 2014లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక్క‌డ నాయ‌కుల‌తో సం బంధం లేకుండా.. టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బడినా.. గెలుపు గుర్రం ఎక్కారు. 2009లోఅంబ‌టి బ్రాహ్మ‌ణ య్య విజ‌యం సాధించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. కాంగ్రెస్ నుంచి  టీడీపీలోకి వ‌చ్చిన మం డలి బుద్ధ‌ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. 2019 ఎన్నిక‌ల‌కు వచ్చేస‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. సింహాద్రి ర‌మేశ్ బాబు.. ఇక్క‌డ నుంచి విజ యం సాధించారు. క‌ట్ చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డెవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జిల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన‌.. చంద్ర‌బాబు ప‌నిలో ప‌నిగా.. మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌తోనూ.. చ‌ర్చించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కాదు.. త‌న కుమారుడికి అవ‌కాశం ఇవ్వాల‌ని.. మండలి కోరిన‌ట్టు తెలిసింది.

అయితే.. చంద్ర‌బాబు మాత్రం.. మ‌రోసారి కూడా మండ‌లికే.. టికెట్ ఇస్తాన‌ని.. ఆయ‌న‌నే పోటీ చేయాల ని.. అన్న‌ట్టుగా.. టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అది కూడా టీడీపీ అనుకూల మీడియాలోనే వార్త‌లు రావ‌డం.. క్షేత్ర‌స్థాయి నేత‌ల్లో చ‌ర్చ‌ల‌కు దారితీసింది.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటారు?  అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాలు చూస్తే.. సింహాద్రి ర‌మేశ్‌.. దూకుడుగానే ఉన్నారు.

దీనికితోడు.. జ‌న‌సేన త‌ర‌ఫున‌గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన కృష్ణారావు కూడా.. పార్టీలోనే కొన‌సాగు తున్నారు. దీంతో కాపు ఓటు బ్యాంకు మ‌ళ్లీ ఎటు వైపు మొగ్గు చూపుతుంది? అనే దానిపైనే.. మ‌ళ్లీ విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేశ్‌.. బాబు.. దాదాపు 20 వేల ఓట్ల తేడాతో విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆరేంజ్‌ను దాటేలా.. టీడీపీ అడుగులు వేయాల్సి ఉంది. పైగా.. సంస్థాగ‌త ఓటు బ్యాంకుపైనా దృష్టి పెట్టాలి. కానీ..ఇక్క‌డ ఇప్పుడు.. ఇలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది.. చూడాలి.
Tags:    

Similar News