కండోమ్ తెచ్చివ్వాలా? విద్యార్థిపై మహిళా ఐఏఎస్ అసభ్య వ్యాఖ్యలు

Update: 2022-09-29 04:35 GMT
స్కూల్ విద్యార్థినుల పట్ల ఓ మహిళా ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీహార్ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ హర్జోత్ కౌర్ భమ్రా తాజాగా స్కూలు విద్యార్థుల వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని.. '20, 30 రూపాయాలకు ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వగలదా?' అని ప్రశ్నించింది. దానికి ఐఏఎస్ఘాటుగా రిప్లై ఇచ్చింది.

కార్పొరేషన్ -యునిసెఫ్ నిర్వహించిన 'సశక్త్ బేటీ, సమృద్ధ్ బీహార్' కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నల వీడియో వైరల్ అయ్యింది. ఐఏఎస్ అధికారి చిరాకుతో కూడిన సమాధానాలు దుమారం రేపాయి.  

ప్రభుత్వం విద్యార్థులకు స్కూల్ డ్రెస్, స్కాలర్‌షిప్, సైకిళ్లు, అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, బాలికలకు 20 నుండి 30 రూపాయలకు శానిటరీ ప్యాడ్‌లు అందించగలరా అని ఒక విద్యార్థి భమ్రాను అడగింది. దీనికి ఘాటుగా ఐఏఎస్ సమాధానమిచ్చింది.  "ఈరోజు ప్రభుత్వం మీకు రూ.20 నుంచి రూ.30కి శానిటరీ ప్యాడ్‌లు అందజేస్తుందని.. ఆ తర్వాత జీన్స్, ప్యాంట్, అందమైన షూలు కావాలని అడుగుతారు" అని భమ్రా బదులిచ్చింది.

మరింత ఆగ్రహంతో 'ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, కండోమ్స్ ను కూడా ప్రభుత్వం నుంచి ఆశించేలా ఉన్నారంటూ' భమ్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  దీనికి మరో విద్యార్థి కౌంటర్ఇచ్చారు. 'ప్రజల ఓటుతో ప్రభుత్వం ఏర్పడిందని.. ప్రజల కోసం పనిచేయడమే తమ కర్తవ్యమని ఆ అధికారికి గుర్తు చేశారు. ' ఈ వ్యాఖ్యలపై కూడా ఐఏఎస్ మండిపడ్డారు.  

"ఇది మూర్ఖత్వపు ఎత్తు. మీరు ఓటు వేసి పాకిస్తాన్‌కు వెళ్లకండి. ప్రభుత్వం నుండి డబ్బు మరియు సౌకర్యాలు తీసుకోవడానికి మీరు ఓటు వేస్తున్నారు" అని భమ్రా కోపంగా బదులిచ్చారు.

ఆ విద్యార్థిని స్పందిస్తూ తాను భారతీయురాలినని, పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్తానని ఎదురుప్రశ్నించారు. 'పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంటే, సేవల కోసం ఎందుకు డిమాండ్ చేయరు?' అని విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు.  

మరో బాలిక పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లలో సమస్య ఉందని, అబ్బాయిలు కూడా బాలికల మరుగుదొడ్డిలోకి ప్రవేశించి తమకు అసౌకర్యం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. .

ఈ సమయంలో, హాల్‌లో ఉన్న ప్రతి విద్యార్థికి ఇంట్లో వారికి ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయా అని భమ్రా దబాయించింది. ఇలా విద్యార్థులను కించపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తీరును చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా మంది ఆశ్చర్యపోయారు.. షాక్ అయ్యారు కూడా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News