పురుషుడిలాంటి మహిళపై లైంగిక కేసు.. శిక్ష!

Update: 2016-10-11 05:08 GMT
ఆమెకు ఇద్దరు భార్యలు... అవును మీరు చదివింది నిజమే! ఆమె ఏమిటి పైగా ఆమెకు భార్యలేమిటి? ఆ సంగతి కాసేపు పక్కనపెడితే అది చాలదన్నట్లు పక్కింటి పిల్లలపై లైంగిక వేధింపులు.. సింగపూర్ దేశ నేరచరిత్రలోనే అత్యంత అరుదైన ఒక కేసు తాజాగా సంచలనం సృష్టించింది.. అయితే ఈ కేసు తుది తీర్పు విషయంలో కూడా ఆ దేశ సుప్రీంకోర్టు అంతే సంచలన తీర్పు చెప్పింది. ఫలితంగా ఇన్నాళ్లూ మగాడిగా చెలామణి అయిన మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వినడానికి విచిత్రంగానూ, కంఫ్యూజన్ గానూ ఉన్న ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

జునికా అహ్మద్ (40) అనే (జన్యుపరంగా) మహిళ సింగపూర్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. జన్యుపరంగా మహిళ అయినప్పటికీ ఆమె మగవాడిగానే చెలామణి అయ్యేది. నడక - నడత - బిహేవియర్ - హెయిర్ స్టైల్ - డ్రెస్సింగ్ స్టైల్ ఏ విషయంలోనూ ఏమాత్రం అనుమానం రాకుండా మగాడిగానే తిరిగేది. ఈ క్రమంలో ఏకంగా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేయడం, అనంతరం వాళ్లిద్దరినీ పెళ్లాడటం కూడా జరిగిపోయింది. అయితే అప్పటికే ఇద్దరు భార్యలతో కలిసి ఒక  అపార్ట్ మెంట్ లో ఉంటోన్న ఈమె దృష్టి పక్క ఫ్లాట్ లో ఉండే 13 ఏళ్ల బాలికపై పడింది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని - చేతివేళ్లు - సెక్స్ డాల్స్ సహాయంతో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం మొదలుపెట్టింది. సుమారు ఆరునెలలపాటు ఆ వ్యవహరాన్ని రహస్యంగా సాగించింది.

ఇదే క్రమంలో 2012లో ఉన్నట్లుండి ఒకరోజు జునికాకు, తన పక్క ఫ్లాట్ వాళ్లతో గొడవైంది. అదే సమయంలో ఆ బాలిక కూడా తనపై "ఆమె" జరుపుతున్న అకృత్యాన్ని బయటపెట్టేసింది. దీంతో జునికా పై పోలీస్ కేసు పెట్టారు. అయితే ఈ విషయంలో శిక్షకు భయపడ్డ జునికా... తానసలు మగవాడినే కాదనే రహస్యాన్ని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో నాలుగేళ్ల విచారణ అనంతరం ఆమె మగాడు కానందున మోపిన అభియోగాలల్లో ప్రధానమైనవాటిని కొట్టేస్తున్నట్లు హైకోర్టు సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసువిషయమై బాలిక తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయాలపై సాగిన విచారణల అనంతరం జునికా కేసుపై సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు చెప్పింది. కేవలం మగవాడు కాదన్న ఒకే ఒక్క కారణంతోనే "ఆమె" చేసిన తప్పులను మన్నించలేమని, ఆ చిన్నారిపై జునికా చేసింది లైంగికదాడేనని, ఇందుకు శిక్షగా 10 ఏళ్ల కఠిన కారాగారం అనుభవించాలని తీర్పు వెల్లడించింది. కాగా, సింగపూర్ చట్టాల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలపై లైంగికదాడి చేసిన, వారితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే జునికాకు మాత్రం 10ఏళ్లే పడింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News