'అమ్మ‌' అనిపించుకునేందుకు ఎంత ఘోరం చేసిందంటే!

Update: 2022-11-27 02:30 GMT
'అమ్మ‌' అని అనిపించుకునేందుకు వివాహితులు క‌ల‌లుగంటారు. పెళ్ల‌యిన మ‌రుక్ష‌ణం నుంచి ఎప్పుడెప్పుడు బిడ్డ‌కు జ‌న్మ‌నిద్దామా? అని త‌పించిపోతుంటారు.  అయితే, కొంద‌రికి అనారోగ్య కార‌ణాల‌తో పిల్ల‌లు పుట్ట‌ని సంద‌ర్భాలు కామ‌న్‌గా మారిపోయాయి. ఇలాంటి వారినే త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న తాంత్రికులు.. ఏవేవో చెబుతూ.. వారిని నిలువునా మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో అత్యంత సంచ‌ల‌న ఘ‌ట‌న యూపీలో చోటు చేసుకుంది.

త‌న‌కు పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని.. ఓ తాంత్రికుడిని ఆశ్ర‌హించిన వివాహిత‌కు.. స‌ద‌రు తాంత్రికుడు.. ఎవ‌రైనా ఓ చిన్నారిని చంపి.. ర‌క్తం తాగితే.. పిల్ల‌లు పుడ‌తార‌ని స‌లహా ఇచ్చాడు. దీనిని న‌మ్మిన ఆ వివాహిత అదే ప‌నిచేసింది. చివ‌ర‌కు జీవిత ఖైదీగా ఊచ‌లు లెక్కపెట్టే ప‌రిస్థితి తెచ్చుకుంది. ఆద్యంతం దారుణ‌మైన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇవీ..

యూపీలో షాజహాన్పుర్ జిల్లాలోని రోజా పోలీస్స్టేషన్ పరిధిలోని జముకా గ్రామంలో ఓ మహిళ.. పదేళ్ల బాలుడ్ని చంపి రక్తం తాగింది. 2017 డిసెంబర్ 5న ధన్దేవి అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. తన పొరుగింట్లో ఉండే లాల్దాస్ అనే పదేళ్ల చిన్నారికి.. టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసింది. అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి బాలుడు గొంతు కోసి హత్య చేసింది.

ఆ తర్వాత చెంపను కోసి రక్తాన్ని తాగి.. మృతదేహాన్ని ఇంటి ముందు పడేసింది. అయితే చిన్నారి మృతదేహం వద్ద కుంకుమ, గాజులతో పాటు మరికొన్ని క్షుద్రపూజకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. దీనిపై చిన్నారి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యలో సంబంధం ఉన్న ధన్దేవీతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ స్థానిక జిల్లా కోర్టు జీవితఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఐదేళ్ల తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది.

ఈ హత్య చేసిన మ‌హిళ త‌న‌కు పిల్ల‌లు లేరంటూ.. ఓ మంత్రగాడిని సంప్రదించగా తన చేతులతో వేరొకరి బిడ్డను హ‌త్య‌ చేసి.. ఆ బిడ్డ రక్తం తాగాలని సూచించాడు. అలా చేస్తేనే పిల్లలు పుడతారని తెలిపాడు. తాంత్రికుడు మాటలు నమ్మిన దేవీ.. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఈ హత్యలో మరో ఇద్దరికి భాగం ఉన్నట్లు వెల్లడించింది. వారందరికి కోర్టు శిక్షను విధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News