గార్డెన్ సిటీ వికృతరూపంపై కొత్త వీడియో

Update: 2017-01-04 06:41 GMT
బెంగళూరు మగాళ్లలో ఎంత క్రూరులు ఉన్నారన్న విషయాన్ని చెప్పే షాకింగ్  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. డిసెంబరు 31వ అర్థరాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్ల సందర్భంగా బెంగళూరులోని ఏంజీ రోడ్ లో చోటు చేసుకున్న ఉదంతం గురించి మీరు ఇప్పటికే చదివి ఉంటారు. కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు భారీగా వచ్చిన మహిళల్ని.. మగాళ్లు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. వారిని ఎక్కడ పడితే అక్కడ తాకటం.. బలవంతంగా వ్యవహరించటం లాంటి పాడు పనులెన్నో చేశారు.

ఇదిలా ఉంటే.. అదే రోజు రాత్రి.. బెంగళూరులోని చాలా వీధుల్లో ఇలాంటి దారుణ ఘటనలే చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక ఇంటికి అమర్చిన సీసీ కెమేరాలో నిక్షిప్తమైన ఫుటేజ్ తో జరిగిన భయానక ఘటన బయటకు వచ్చింది. న్యూఇయర్ వేళలో ఆటో దిగి ఇంటికి వెళుతున్న ఒక యువతిని టూవీలర్ మీద వచ్చిన కుర్రాళ్లలో ఒకరు కిందకు దిగి.. రోడ్డు మీద వెళుతున్న ఒక అమ్మాయిని బలంతంగా కౌగిలించుకోవటమే కాదు.. ఆమె అరుస్తున్నా.. కొట్టుకుంటున్నా విడకుండా రాక్షసానందాన్ని పొందాడు. అంతటితో ఆగకుండా.. రోడ్డు మధ్యన పట్టుకున్న ఆ అమ్మాయిని తన టూవీలర్ వద్దకు తీసుకొచ్చి కూడా వదల్లేదు. అంతేకాదు.. ఈ దుర్మార్గం జరుగుతున్న వేళ.. టూవీలర్ మీద ఉన్న ఆ దుర్మార్గుడితో పాటు ఉన్న వారు సైతం.. ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా వ్యవహరించటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వీధి చివరన వాహనాల మీద వెళుతున్న వారు.. జరుగుతున్న ఘోరాన్నిచూస్తూ ఉండిపోయారే కానీ.. అడ్డుకున్నది లేదు. ఇదంతా బెంగళూరులోని కమ్మాన్ హళ్లీ రోడ్డులోని ఐదవ నెంబరు వీధిలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారటమే కాదు.. బెంగళూరు మహానగరం మరీ ఇంత భయానకమైనదా? అన్న సందేహం కలిగేలా చేస్తోంది.
<Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News