ముంబై పేలుళ్ల కేసులో దోషిగా శిక్షను ఎదుర్కొంటున్న మాఫియాడాన్ అబుసలేం తనను పెళ్లి చేసుకొంటానంటున్న యువతిని పెళ్లాడటానికి ముందుకొచ్చాడు. తనను వివాహం చేసుకొంటాను అంటున్న 26 యువతిని చేరదీయడానికి తనకేం అభ్యంతరం లేదని..దీనిపై తనకు అనుమతిని ఇవ్వాలని ఇతడు కోర్టుకు విజ్ఞప్తి చేసుకొన్నాడు. దీంతో ఇప్పుడు డాన్, అతడి ప్రేయసిల కథ ఆసక్తికరమైన మలుపు తీసుకొంది.
మాఫియాడాన్ అబుసలేంతో తన వివాహం జరిగిందని మీడియాలో ప్రచారం జరిగిందని.. దీంతో ఇప్పుడు తనకు పెళ్లి కాకుండా పోతోందని.. ఇక గత్యంతరం లేదని.. తను అబుసలేంనే వివాహం చేసుకొంటానని.. జరిగిన ప్రచారాన్నే నిజం చేస్తానని.. అంటూ ఒక యువతి టాడా కోర్టులో పిటిషన్ వేసుకొన్న సంగతి తెలిసిందే.
జైల్లో ఉన్న వ్యక్తితో వివాహానికి అనుమతిని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సలేం స్పందిస్తూ తనూ ఒక పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తీవ్రవాద నేరం కింద జైల్లో ఉన్న వ్యక్తి వివాహానికి కోర్టు అనుమతిని ఇస్తుందా? లేక ఆయువతి పిటిషన్‌ను అర్థం లేనిదిగా భావించి కొట్టి వేస్తుందా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయినా వీళ్లిద్దరూ పెళ్లికి ఉత్సాహపడుతున్నారు కానీ.. కోర్టు అనుమతిని ఇచ్చి ఆ కార్యం కాస్తా జరిగినా.. కాపురం ఎక్కడ పెడతారో! దానికీ అనుమతిని అడుగుతారేమో!