బుర‌ఖా తీసినందుకు అరెస్ట్‌!

Update: 2016-12-13 15:23 GMT
సాధార‌ణంగా ఎలాంటి త‌ప్పుల‌కు అరెస్టు చేస్తారు? పెద్ద త‌ప్పుల‌కు పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి అరెస్టు చేయ‌డం స‌హ‌జం. కానీ ఒక మ‌హిళను బుర‌ఖా ధ‌రించ‌లేద‌నే కార‌ణంలో పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసు వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం సౌదీకి చెందిన‌ ఓ మ‌హిళ బురఖా తీసి ఫోటో దిగింది. అనంత‌రం దాన్నిట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

పోలీసు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం స‌ద‌రు మ‌హిళ నైతిక నియ‌మాల‌ను ఉల్లంఘించినందుకు ఆమెను అరెస్టు చేసిన‌ట్లు వివ‌రించారు. సౌదీ చ‌ట్టాల ప్ర‌కారం మ‌హిళ‌లు బుర‌ఖా ధ‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి అని పేర్కొంటూ ఆ నియ‌మాల‌ను ఉల్లంఘించి ఓ కేఫ్ ప‌క్క‌న ఫొటో దిగ‌డ‌మే కాకుండా దానిని ట్విట్ట‌ర్ లోనూ పోస్ట్ చేసింద‌ని దీంతో తాము అరెస్టు చేశామ‌ని తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం గురించి ప‌లువురు నెటిజ‌న్లు ఆమెపై విరుచుప‌డ్డార‌ని స‌ద‌రు పోలీసు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News