టెస్లా.. అమెరికా కేంద్రంగా నడిచే విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ.. విద్యుత్ పరికరాలు, బల్బులు, ఇతర పరికరాలు కూడా టెస్లా పేరుతో మార్కెట్లో కనిపిస్తుంటాయి. అలాంటి పెద్ద కంపెనీ కి చైర్మన్ ఎలాన్ మస్క్. ఈయన అద్భుతం సృష్టించారు. ఒక గంటలో ఏకంగా 16వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచారు.
60 నిమిషాల్లో 16వేల కోట్లే.. బాప్ రే అని ఆశ్చర్యపోకండి.. మీరే కాదు.. స్టార్ మార్కెట్ పరిశీలకులు కూడా టెస్లా ఓనర్ సాధించిన ఘనతకు ముక్కున వేలేసుకున్నాయి.
తాజాగా టెస్లా విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోయాయి. దీంతో దాని యజమాని ఎలాన్ సంపద అనూహ్యంగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపద విలువ 2.3 బిలియన్ డాలర్లు అంటే ఏకంగా రూ.16443 కోట్లు పెరగడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా టెస్లా మాత్రం ఎక్కువ లాభాలు గడించడంతో కంపెనీ షేర్ల విలువ 12శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపాదన విలువ 36 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో తెలిపింది.
అమెరికా దేశానికి చెందిన ఎలాన్ మస్క్ ఆధునాతన టెక్నాలజీ కంపెనీల సృష్టికర్త. స్పేస్ ఎక్స్ పేరుతో ప్రైవేట్ రాకెట్లను ఈయన అంతరిక్షంలోకి పంపిస్తుంటారు. ఎలక్రిక్ కార్లు, ట్రక్ లను తయారు చేస్తూ టెస్లా కంపెనీని ప్రపంచంలోనే నంబర్1 గా తీర్చిదిద్దారు. అంగారకుడి పైకి సాధారణ జనాలను తీసుకెళ్లే అంతరిక్ష యాత్రలకు ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు.