వావ్ : విశాఖ తీరాన త‌మిళ సై కు నీరాజ‌నాలు !

Update: 2022-05-04 03:34 GMT
జీవితంలో అవ‌మానాలు పొందిన రోజును మ‌రువ‌కూడ‌దు. జీవితంలో అదీ స్వామి స‌న్నిధిలో ద‌క్కిన లేదా ద‌క్కించుకున్న గౌర‌వాన్నీ మ‌రువ‌కూడ‌దు. తెలంగాణ వాకిట నిత్యం అవ‌మానాలే ఆమెకు కానీ ఆంధ్రాకు రాగానే ఆమెకు నీరాజనాలు ప‌లికారు. సొంత ఆడ‌ప‌డుచు మాదిరిగా ఆమెను ఆదరించారు. మంత్రి కేటీఆర్ అన్న విధంగా ఈ ప్రాంతం ఆత్మీయ‌త‌ల‌కు నెల‌వు. అందుకే ఎంద‌రో ఇక్క‌డికి వ‌చ్చి వెళ్లిన ప్ర‌తిసారీ ఒకే మాట చెబుతారు ఆంధుల ప్రేమాభిమానాలు త‌ర‌గ‌ని ఆత్మీయ‌త‌కు ఆన‌వాళ్లు అని.. అదే నిజం కూడా !

యాద‌గిరి గుట్టకు వెళ్తే ఆమెను ప‌ట్టించుకోలేదు. అస‌లు ప‌ర్య‌ట‌న ఉందా లేదా అన్న మీమాంస‌ను తెర‌పైకి తెచ్చే విధంగా ప్ర‌వ‌ర్తించారు అధికారులు. కానీ అదే గ‌వ‌ర్న‌ర్  ఆంధ్రా ప్రాంతానికి వచ్చి వెళ్లారు. ఓ దివ్యానుభూతి ఇది అని ప్రశంసించి వెళ్లారు.

అక్క‌డ ఆమె అవ‌మానం. ఇక్క‌డ ఆమెకు గౌర‌వం. దైవ స‌న్నిధిలో ఆమెకు అత్యున్న‌త గౌరవం అని రాయాలి. అలానే ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న వారిలో టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి దంప‌తుల‌తో పాటు ఆల‌య ట్ర‌స్టీ చైర్మ‌న్  అశోక్ గ‌జ‌ప‌తి రాజు దంప‌తులు ఉన్నారు. ట్ర‌స్టీ హోదాలో గ‌తంలో ఎన్నో అవ‌మానాలు పొందిన ఆయ‌న ఈ సారి ఎంతో గౌర‌వం అందుకున్నారు.

ఆ విధంగా ఒక అవ‌మానం తీరి ఒక గౌర‌వం పెరిగింది... ఈ ఇద్ద‌రి విష‌యంలో..సుంద‌ర విశాఖ తీరాన పావ‌న క్షేత్రం సింహాచ‌లంలో నిన్న‌టి వేళ చందనోత్స‌వం వైభ‌వోపేత రీతిలో జ‌రిగింది. స్వామి ద‌ర్శ‌నానికి వేలాది భ‌క్తులు రాక‌తో ఇక్క‌డ ఆల‌య ప్రాంగ‌ణం స్వామి  నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగింది. ఇదే స‌మ‌యాన ఓ ఆస‌క్తిదాయక ప‌రిణామం గురించి చెప్పాలి. పొరుగు రాష్ట్రంలో అనేక అవ‌మానాలు ఎదుర్కొంటున్న త‌మిళ సై కు ఇక్క‌డ మాత్రం ఎంతో ఆద‌ర‌ణ ద‌క్కింది. అధికారిక లాంఛ‌నాలు అన్నీ అందుకున్నారు.

అస‌లు ఒక్క  మాట‌లో చెప్పాలంటే కేసీఆర్ ద‌గ్గ‌ర  ఉన్న ప్రొటొకాల్ వివాదాలేవీ లేవు. అత్యంత భ‌క్తి పూర్వ‌కంగా ఆల‌యంలో గ‌డిపి వెళ్లిన అనూభూతిని తాను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేన‌ని చెప్పి వెళ్లారు. ఓ విధంగా జ‌గ‌న్ స‌ర్కారు మంచి మార్కులు కొట్టేసింది. గ‌తంలో ఉండే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ ఎక్కువ‌గా వైష్ణ‌వాల‌యాల‌నే సంద‌ర్శించేవారు. కానీ ఈమె తొలిసారిగానే ఇక్క‌డికి వ‌చ్చినా కొండ‌పై ఏర్పాట్లు, భ‌క్తుల‌కు అందిస్తున్న సౌక‌ర్యాలు అన్నీ తెలుసుకుని ఆనందించి వెళ్లారు.

వాస్త‌వానికి గ‌త కొద్దిరోజులుగా త‌మిళ సై (తెలంగాణ గ‌వ‌ర్న‌ర్) అనేక వివాదాల్లో ఇరుక్కు పోతున్నారు. ఆమెకు ప్రొటొకాల్ విష‌య‌మై కూడా క‌నీస గౌర‌వం ద‌క్క‌డం లేదు.ఈ నేప‌థ్యాన కేసీఆర్ కు, ఆమెకు మ‌ధ్య వైరం రోజురోజుకూ పెరిగిపోతోంది. సీఎం కేసీఆర్ ను తాను అన్న‌య్య అని భావిస్తాన‌ని., కానీ ఈ చెల్లెల్లిని గుర్తించ‌డం లేద‌ని వాపోయారు.

కానీ ఆమెకు నిన్న‌టి వేళ యాదగిరి గుట్ట క‌న్నా వైభ‌వోపేత రీతిలో ఆహ్వానం ద‌క్కింది విశాఖ‌లో ! చంద‌నోత్స‌వ వేళ తొలిసారి స్వామి వారిని ద‌ర్శించుకుని ఆత్మీయానుభూతి పొందారు. ఆమె రాక సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు పూర్తి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అన్నీ పాటించి, స్వామి ద‌ర్శ‌నం అయ్యేం త వ‌ర‌కూ అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుని తీర్థ ప్ర‌సాదాలు ఇచ్చి అతిథి మ‌ర్యాద‌ల‌తో సాగ‌నంపారు. మ‌రి! తెలంగాణ‌లో మాత్రం ఆమెను వివాదాలు విసిగిస్తూనే ఉన్నాయి.
Tags:    

Similar News