గంగిరెద్దులు ఆడించే వాళ్లకు పాల్‌ కు తేడా లేదు: పృధ్వీ

Update: 2019-01-31 11:27 GMT
రెండు వారాలుగా ఏపీ రాజకీయాల్లో కేఏ పాల్‌ చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు. పిలిచిన ప్రతీ ఛానెల్‌ కు వెళ్లి కావాల్సినంత కామెడీ చేసి వస్తున్నారు ఆయన. తన ప్రజాశాంతి పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని.. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ కేఏ పాల్‌ ఊదరగొట్టేస్తున్నాడు. అయితే.. అటు టీడీపీ కానీ - ఇటు వైసీపీ కానీ పాల్‌ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో జగన్‌ పై కేఏపాల్‌ అవినీతి పరుడు అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో రీసెంట్‌గా వైసీపీలో చేరిన స్టార్‌ కమెడీయన్‌ పృధ్వీ కేఏ పాల్‌ పై విరుచుకు పడ్డారు. ఏపీ రాజకీయాల్లో కేఏ పాల్‌ని మించిన కమెడీయన్‌ మరొకరు లేడని ఎద్దేవా చేశారు.
         
“మత ప్రభోధకుడిగా వివిధ దేశాల నాయకులకు ఆశీర్వాదాలు ఇచ్చాను అని చెప్పుకునే నువ్వు.. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావు. నువ్వేం ప్రచారకుడివి.? అసలు నీది ఒక పార్టీయేనా.? ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా - ఒక వైసీపీ కార్యకర్తగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని నువ్వే అతిపెద్ద కమెడీయన్‌ వి. ఈ  ఐదేళ్లలో ఎప్పుడూ కన్పించని నువ్వు.. సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల వారిలా ఎన్నికల ముందు వచ్చి ఊడిపడ్డావు. నువ్వు ఎవరికి ఆశీర్వాదాలు ఇచ్చావో మేం ఎవ్వరం ఎప్పుడూ చూడలేదు. ఇక నువ్వు చూపించే ఫోటోలంటావా.. సంతల్లో మేం కూడా అలాంటి ఫోటోలు బోలెడన్నీదిగగలం. నీ దగ్గర నిజంగా అన్ని లక్షల కోట్లుంటే.. కష్టాల్లో ఉన్న తెలంగాణ - ఆంధ్రా రైతులకు చెరో లక్ష కోట్లు ఇవ్వొచ్చు కదా. నువ్వు విశాఖపట్నం అంటున్నావ్‌ - నేను కూడా విశాఖపట్నమే. ముందు మనిషిని గౌరవించడం రాని నువ్వేం మత ప్రభోధకుడివి” అంటూ.. ఓ రేంజ్‌ లో కేఏ పాల్‌ ని చెడుగుడు ఆడుకున్నారు పృధ్వీ.
Tags:    

Similar News