మాటంటే మాటే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. గడిచిన కొన్ని నెలలుగా ఎన్నికల మీదనే పూర్తి ఫోకస్ పెట్టిన ఆయన.. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించి.. యూపీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే.. బుల్ డోజర్లకు పెద్ద ఎత్తున పని చెబుతామని.. ఈ విషయంలో తమకు సహకరించాలని ఆయన కోరటం తెలిసిందే.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించటం ద్వారా.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోగి.. తాజాగా ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు. నిందితులు.. నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది.
యూపీలోని ఒక మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఇళ్లను సగభాగం కూల్చేశారు. తాజాగా మిగిలిన కాస్త భాగాన్ని కూల్చేయటానికి మున్సిపల్ అధికారులు రంగ ప్రవేశం చేయటం.. తాను ఇచ్చిన హెచ్చరికల్ని పట్టించుకోని నిందితుల ఇళ్లను కూల్చేయటం సంచలనంగా మారింది.
యూపీలోని ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులుగా మహమ్మద్ సలీమ్.. మరొకరు మహమ్మద్ అమీర్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరుచలక్ పూర్ గ్రామంలో నివసిస్తూ ఉంటారు. అయితే.. ఈ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు కావటంతో వారు పరారీ అయ్యారు. దీంతో.. పోలీసులు వారి ఇంటికి నోటీసులు అంటించారు.
నిందితులు దాచుకునే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు పోలీసులకు లొంగిపోతే సరి.. లేని పక్షంలో మాత్రం ఇంటినికూల్చేస్తామని హెచ్చరించారు. కొందరునేరస్తులు ఈ వార్నింగ్ కు వెనకుడు వేస్తున్నారు. తాజా ఉదంతంలో నిందితులు పోలీసుల హెచ్చరికల్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
దీంతో.. పోలీసులు మరింత డోసు పెంచుతూ.. నిందితుల ఇళ్లను పాక్షికంగా కూల్చేశారు. నిందితులు లొంగిపోవాలని వారు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవటంతో.. పోలీసులు మరో అడుగు ముందుకు వేసి.. నిందితుల ఇంటిని బుల్ డోజర్ సాయంతో పూర్తిగా కూల్చేశారు. దీంతో.. యోగి సర్కారు బుల్ డోజర్ల ప్రయోగం యూపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.