దూకుడుగా దూసుకెళుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలోనూ సమయం వృధా కాకుండా.. కాలం కలిసి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో కొత్త శకాన్ని షురూ చేయాలని తపిస్తున్న ఆయన అందుకు తగ్గట్లే.. తన స్పీడ్ ను పెంచేశారు. ప్రోగ్రామ్స్ మీద కంటే కూడా పని మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నట్లుగా ఆయన తీరు ఉంది.
తాజాగా ఆయన ఒకే రోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాల్నిపెట్టేసుకున్నారు. తాను ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తొమ్మిది రోజుల తర్వాత కేబినెట్ ను కొలువు తీర్చేలా డిసైడ్ అయ్యారు. ఇందుకు తగ్గ ముహుర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 8న కేబినెట్ ను విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఉదయం 8.39 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆయన.. ఆ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే.. తాను సచివాలయంలో అడుగుపెట్టే ముహుర్తాన్ని కూడా ఓకే చేసేశారు.
మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అయిన తర్వాత ఉదయం 11.49 గంటల వేళలో నూతన సచివాలయంలోని తన సీఎంవోకు వెళ్లనున్నారు. అక్కడ తన ఛాంబర్ లోకి అడుగు పెట్టనున్నారు. ఈరెండు ముఖ్యమైన కార్యక్రమాల్ని వేర్వేరు రోజుల్లో పెట్టకుండా.. ఒకే రోజు పెట్టటం ద్వారా అనవసరమైన హడావుడి లేకుండా చేయటం.. ఖర్చు విషయంలోనూ కలిసి వస్తుందన్న ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.